పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-556-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వడ నాకు మీవలన బ్బిన తీర్థ సుకీర్తనీయ స
ల్లలిత వినిర్మలామృత విలాస యశో విభవాభిరామమై
వెయు వికుంఠనామ మపవిత్ర మనశ్శ్వపచాధమాది లో
కు చెవి సోఁకఁ దత్క్షణమ కోరి పవిత్రులఁ జేయు వారలన్.

టీకా:

అలవడ = సిద్ధముగ; నాకు = నాకు; మీ = మీ; వలన = వలన; అబ్బిన = లభించిన; తీర్థ = పావనమైన; సుకీర్తనీయ = మంచిగ స్తుతింపదగిన; సత్ = మంచి; లలిత = అందమైన; వినిర్మల = బాగా స్వచ్ఛమైన; అమృత = అమృతము వంటి; విలాస = శోభ కలిగిన; యశో = కీర్తియు; విభవ = వైభవములతో; అభిరామము = ఒప్పారుచున్నది; ఐ = అయ్యి; వెలయు = విలసిల్లు; వికుంఠ = వికుంఠుడు అను; నామము = పేరు; అపవిత్ర = అపవిత్రమైన; మనస్ = మనసు కలవారు; శ్వపచ = అపరిశుభ్రులు {శ్వపచ - కుక్క మాంసము తినువారు, అపరిశుభ్రులు}; అధమ = నీచులు; ఆది = మొదలగు; లోకుల = జనుల యొక్క; చెవి = చెవి; సోకన్ = తగిలిన; తత్క్షణమ = వెంటనే; కోరి = ఇచ్చించి; పవిత్రులన్ = పవిత్రమైనవారినిగా; చేయు = చేయును; వారలన్ = వారిని.

భావము:

మీవల్ల నాకు లభించిన పుణ్యక్షేత్రం ఈ వైకుంఠం. ఇది ఎంతో పవిత్రమై, పొగడదగినదై, సుందరమై, అమృతమయమై, కీర్తివైభవంతో శోభిస్తూ అలరారుతున్నది. ఇది తన పేరు విన్నవారిని ఎటువంటి అపవిత్రులనైనా, కుక్క మాంసం తినే శ్వపచులనైనా పవిత్రులను చేస్తుంది.