పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-73-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి నరులకెల్లఁ బూజ్యుఁడు
రి లీలామనుజుఁడును గుణాతీతుఁడునై
రఁగిన భవకర్మంబులఁ
బొఁయండఁట హరికిఁ గర్మములు లీలలగున్.

టీకా:

హరి = కృష్ణుడు {హరి - పాపములను హరించువాడు, విష్ణువు}; నరులు = మానవులు; కున్ = కు; ఎల్లన్ = అందరికిని; పూజ్యుడు = పూజింప తగ్గవాడు; హరి = కృష్ణుడు; లీలా = లీలకు మాత్రమే; మనుజుడును = మానవుడును; గుణ = గుణములకు; అతీతుడును = అతీతమైనవాడును; ఐ = అయి; పరగినన్ = ప్రవర్తిల్లుటచే; భవ = సంసార; కర్మంబులన్ = కర్మములను; పొరయడు = అంటడు; అట = అక్కడ; హరి = కృష్ణుని; కిన్ = కి; కర్మములు = కర్మములు; లీలలు = లీలలు; అగుచున్ = అవుతూ.

భావము:

హరి మానవులందరికీ పూజనీయుడు. ఆయన లీలామానుషవిగ్రహుడు. గుణాలకు అతీతమైన వాడు. జన్మ సంబంధమైన బంధాలు ఆయనకు లేవు. అవి కేవలం ఆ వాసుదేవునికి లీలావిలాసాలు మాత్రమే.