పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-72-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంబందుటలేని యీశ్వరుఁడు దా న్మించుటెల్లన్ విరో
ధినిరాసార్థము వీతకర్ముఁడగు నద్దేవుండు గర్మప్రవ
ర్తనుఁ డౌటెల్లఁ జరాచరప్రకటభూశ్రేణులం గర్మవ
ర్తనులం జేయఁదలంచి కాక కలవే దైత్యారికింగర్మముల్.

టీకా:

జననంబందుట = పుట్టుటన్నది; లేని = లేనట్టి; ఈశ్వరుడు = కృష్ణుడు {ఈశ్వరుడు - ఒడయుడు, విష్ణుడు}; తాన్ = తాను; జన్మించుట = పుట్టుట; ఎల్లన్ = అంతా; విరోధి, విరోధించుట (మచ్చరించుట) చేయువాడు = లోకవిరుద్ధుల, ; నిరాస = ఖండించుట; అర్థము = కోసము; వీతకర్ముడు = కర్మలు వీడినవాడు; అగు = అయిన; ఆ = ఆ; దేవుండు = దేవుడు; కర్మ = కర్మలను; ప్రవర్తనుడు = చేయువాడు; ఔటన్ = అగుట; ఎల్లన్ = అంతా; చర = కదలునవి; అచర = కదలలేనివిగా; ప్రకట = వెలువడు; భూత = జీవ; శ్రేణులన్ = రాశులను; కర్మ = కర్మలను; వర్తనులను = అనుసరించువారను; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొని; కాక = అలా కాని పక్షమున; కలవే = ఉన్నాయా ఏమి; దైత్యారి = కృష్ణుని {దైత్యారి - దితి పుత్రులు (రాక్షసులు)కు శత్రువు, విష్ణువు}; కిన్ = కి; కర్మముల్ = కర్మలు.

భావము:

పుట్టుక అన్నదే లేని ఆ భగవంతుడు పుడుతున్నాడంటే కేవలం మచ్చరించువారిని ఖండించడానికే; కర్మలు లేని దేవుడు కర్మలు చేస్తున్నాడంటే చరాచర జీవకోటిని కర్మబద్ధుల్ని చేయడానికే; అంతేకాని, రాక్షసాంతకుడైన విష్ణుమూర్తికి కర్మలంటూ ఉంటాయా? ఉండవు.