పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-71.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాధలనలంచు దుష్టభూతులనెల్ల
సైన్యయుక్తంబుగా నని సంహరించు
కొఱకు సభలోన నప్పుడా కురుకుమారు
లాడు దుర్భాషణములకు లుగఁడయ్యె.

టీకా:

అట్టి = అట్టి; సరోజాక్షుడు = కృష్ణుడు {సరోజాక్షుడు - సరోజ (పద్మము) లవంటి కన్నులున్న వాడు, కృష్ణుడు}; ఆత్మీయ = తన; పద = పాదములందు; భక్తులు = భక్తికలవారు; అడవులన్ = అడవులలో; ఇడుమలన్ = బాధలను; కుడుచుచున్ = పడుతూ; ఉండన్ = ఉండగా; దౌత్యంబున్ = దౌత్యము; చేయన్ = చేయుచుండగా; కొందఱు = కొంచరు; విరోధులు = శత్రువులు; హరిన్ = కృష్ణుని; బద్ధునిన్ = బంధింపబడినవాని; చేయన్ = చేయుటకు; సన్నధులు = సిద్ధమమైనవారు; ఐనన్ = కాగా; బలహీను = బలములేనివాని; మాడ్కిన్ = వలె; మార్పడలేడ = ఎదురుతిరుగలేడు; అసమర్థుడు = చేతకానివాడు; అని = అని; తలచెదవు = అనుకొనెదవు; ఏని = అయితే; అచ్యుతుండు = కృష్ణుడు {అచ్యుతుడు - చ్యుతము (నాశము) లేనివాడు, విష్ణువు}; పరుల = ఇతరుల, శత్రువుల; జయింపన్ = గెలుచుట; ఓపక = రాక; కాదు = కాదు; విద్య = విద్య; అభిజాత్య = వంశము; ధనంబులన్ = సంపదలవలన; జగతిన్ = లోకమును; పెక్కు = మిక్కిలి; బాధలన్ = బాధలతో; అలంచు = వేపుకుతిను; దుష్ట = చెడ్డ; భూపతులన్ = రాజులన్ {భూపతి - భూమికి భర్త, రాజు}; ఎల్లన్ = అందరను; సైన్య = సైన్యముతో; యుక్తంబుగాన్ = సహా; అనిన్ = యుద్ధములో; సంహరించు = అంతముచేయుట; కొఱకున్ = కోసమై; సభ = (కురు)సభ; లోన్ = లో; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; కురు = కురువు యొక్క; కుమారులు = వంశము వారు; ఆడు = పలుకు; దుర్భాషణములు = దుర్భాషలు; కున్ = కి; అలుగడు = కోపించు తెచ్చుకోనివాడు; అయ్యెన్ = అయ్యెను.

భావము:

ఆ పద్మాక్షుడు తన యొక్క భక్తులు అడవుల్లో అష్టకష్టాలు పడడం చూడలేక వారికోసం రాయబారం నడిపాడు. శత్రువులు కొందరు అతణ్ణి పట్టి కట్టివేయాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అప్పుడు అచ్యుతుడు అశక్తునిలాగా వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. అంతమాత్రం చేత అది ఆయన అసమర్థత అనుకోడానికి లేదు. ఆయన వారిని జయించలేక కాదు. విద్య, వంశం, ధనం అనే వీనివల్ల అహంకరించి లోకుల్ని పలుబాధలకు లోనుచేస్తున్న దుష్ట రాజుల్ని ససైన్యంగా సంగ్రామభూమిలో సంహరించాలనే సదుద్దేశంతోనే ఆనాటి సభలో కౌరవుల సూటిపోటి మాటలకు నొచ్చుకోలేదు. ఆగ్రహం తెచ్చుకోలేదు.