పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-70-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయిన నమ్మహాత్ముని కరుణాతరంగితాపాంగ పరిలబ్ధ విజ్ఞాన దీపాంకుర నిరస్త సమస్తదోషాంధకారుండ నగుటంజేసి మదీయ చిత్తంబు హరిపరాయత్తంబయిన కారణంబుననుఁ, దత్త్వంబు సతతంబు నిరీక్షించుచు నుండుదు; మఱియును.

టీకా:

అయినన్ = అయినప్పటికిని; ఆ = ఆ; మహాత్ముని = మహాత్ముని; కరణా = దయా; తరంగిత = తరంగములతో కూడుకున్న; అపాంగ = కటాక్షములు; పరి = బాగుగ; లబ్ధ = పొందిన; విజ్ఞాన = విశిష్ట జ్ఞానము అను; దీప = దీపపు; అంకుర = మొలకచే; నిరస్త = తొలగింపబడిన; సమస్త = సమస్తమైన; దోష = దోషములను; అంధకారుండన్ = అంధకారము కలవాడను; అగుటన్ = అగుట; చేసి = వలన; మదీయ = నా యొక్క; చిత్తంబు = మనసు; హరి = విష్ణువుని; పరా = అందే; ఆయత్తంబు = లగ్నమైనది; అయిన = అయినట్టి; కారణంబునను = కారణమువలన; తత్త్వంబున్ = యదార్థతత్త్వమును; సతతంబున్ = ఎల్లప్పుడూ; నిరీక్షించుచున్ = చూస్తూ; ఉండుదున్ = ఉంటాను; మఱియున్ = ఇంకనూ.

భావము:

ఏమైతేనేం, ఆ మహానుభావుడు శ్రీకృష్ణుని కడగంటి చూపుల కరుణారసం ద్వారా లభించిన జ్ఞానదీపకళికలవల్ల నా దోషాలనే చీకట్లన్నీ తొలగిపోయాయి. నా చిత్తం భగవంతుని పాదాలను హత్తుకున్నది. అందువల్ల ఆ పరతత్త్వం కోసమే నిరంతరం నిరీక్షిస్తూ ఉన్నాను.