పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-68-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకవిడంబనమున
రి పరమపరుండు మానవాకృతితో ని
ద్ధరఁబుట్టి యాత్మమాయా
స్ఫుణన్ మోహింపఁజేయు భూజనకోటిన్.

టీకా:

నర = మానవ; లోక = లోకమును; విడంబనమునన్ = అనుకరించుట వలన; హరి = కృష్ణుడు; పరమపరుడు = పరాత్పరుడు {పరమపరుడు - పరమైనవానికిని పరమైన (ఉన్నతమైన) వాడు, పరాత్పరుడు}; మానవ = మానవుని; ఆకృతిన్ = రూపమున; ఈ = ఈ; ధరన్ = భూమిపైన; పుట్టి = పుట్టి; ఆత్మ = తన; మాయా = మాయ యొక్క; స్ఫురణన్ = నేర్పరితనముతో; మోహింపన్ = మోహములో పడునట్లు; చేయున్ = చేయున్; భూ = భూవాసులైన; జన = జనులు; కోటిన్ = అందరను.

భావము:

పరాత్పరుడైన హరి లీలామానవుడై ఈ లోకంలో పుట్టి తన మాయాప్రభావంతో మానవుల నందరినీ వ్యామోహంలో ముంచుతున్నాడు.