పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-67-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుంగాక పరమశాంతుండవైన నీ మనంబున దుఃఖంబు కర్తవ్యంబుగాదంటేని.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; పరమ = మిక్కిలి; శాంతుండవు = శాంత స్వభావివి; ఐన = అయినట్టి; నీ = నీ యొక్క; మనంబునన్ = మనసులో; దుఃఖంబున్ = దుఃఖము; కర్తవ్యంబున్ = పద్దతి; కాదు = కాదు; అంటేని = అన్నట్లైతే.

భావము:

నీవేమో పరమశాంతుడవు. నీవు ఇలా దుఃఖపడటం సమంజసం కా దని అంటావేమో.