పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-66-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుజుఁడు వీఁడనకయ తన
యులు నను వెడలనడువఁ దానూరకయుం
డి ధృతరాష్ట్రుఁడు నరకం
బునఁబడు నాదైన దుఃఖమున ననఘాత్మా!

టీకా:

అనుజుడు = సోదరుడు; వీడు = ఇతడు; అనకయ = అని చూడక; తన = తన యొక్క; తనయులు = కొడుకులు; ననున్ = నన్ను; వెడల = బయటకు; నడువన్ = గెంటుతుండగా; తాన్ = తను; ఊరకయుండిన = ఊరకుండిపోయినట్టి; ధృతరాష్ట్రుఁడు = ధృతరాష్ట్రుడు; నరకంబునన్ = నరకములో; పడున్ = పడును; నాది = నాకు; ఐన = అయినట్టి; దుఃఖమునన్ = దుఃఖము వలన; అనఘాత్మా = పుణ్యాత్ముడా.

భావము:

ఉద్దవా! పాపరహితుడవైన మహానుభావా! తన తుంటరి కొడుకులు నన్ను బయటికి గెంటేసినప్పుడు, తమ్ముడు అని కూడా చూడకుండా నోరుమూసుకొని ఊరకున్న ధృతరాష్ట్రుడు నాకు కలిగించిన దుఃఖానికి తప్పక నరకయాతన అనుభవిస్తాడు.