పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-62-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తెఱఁగొప్పన్ జననీవియోగమునఁ గుంతీస్తన్యపానంబు సో
సంరక్షయుఁ గల్గి దేవవిభు వక్త్రస్థామృతంబున్ ఖగే
శ్వరుఁ డర్థిం గయికొన్న మాడ్కిఁ గురువంశ్రేణి నిర్జించి త
ద్ధణీరాజ్యముఁ గొన్న మాద్రికొడుకుల్ న్యాత్ములే? యుద్ధవా!

టీకా:

తెఱగు = మంచి పద్దతి ప్రకారము; ఒప్పన్ = ఒప్పునట్లు; జననీ = తల్లి; వియోగమున్ = ఎడబాటువలన; కుంతీ = కుంతీదేవి; స్తన్య = పాలు; పానంబు = త్రాగుటయు; సోదర = సోదరుల; సంరక్షయున్ = రక్షణయు; కల్గి = కలిగి; దేవవిభు = దేవేంద్రుని {దేవవిభు - దేవతలకు ప్రభువు, దేవేంద్రుడు}; వక్త్రస్థ = నోటి ముందున్న; అమృతంబున్ = అమృతమును; ఖగేశ్వరుడు = గరుత్మంతుడు {ఖగేశ్వరుడు - పక్షులకు ప్రభువు, గరుత్మంతుడు}; అర్థిన్ = కోరి; కయికొన్న = తీసుకొన్న; మాడ్కిన్ = విధముగ; కురు = కౌరవ; వంశ = వంశపు; శ్రేణిన్ = సేనలను; నిర్జించి = ఓడించి; తత్ = ఆ; ధరణీ = భూమిపై; రాజ్యమున్ = ప్రభుత్వమును; కొన్న = తీసుకొన్న; మాద్రి = మాద్రి యొక్క; కొడుకుల్ = కొడుకులు; ధన్య = ధన్యమైన; ఆత్ములే = మనసు కలవారేనా; ఉద్దవా = ఉద్దవుడా.

భావము:

ఓ ఉద్ధవా! తమ కన్నతల్లి కాలంచేయగా, చక్కగా కుంతీదేవి చనుబాలు త్రాగిన వారూ, అన్నలచే రక్షింపబడినవారూ, ఇంద్రుడి అధీనంలో ఉన్న అమృతాన్ని సంపాదించిన గరుత్మంతునిలా, కౌరవుల నందరినీ నిర్జించి వారి రాజ్యాన్ని ఆర్జించినవారూ అయిన మాద్రి కొడుకులు నకులసహదేవులు కుశలంగా ఉన్నారా?