పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-60-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నగదాభ్యాస చిత్ర సంతుల మెఱసి
కురుకుమారుల భూరి సంము లోన
తులఁ గావించి వెలసినట్టి జెట్టి
వాయుతనయుండు గుశలియై ఱలునయ్య?

టీకా:

ఘన = గొప్ప; గదా = గదా ప్రయోగ; అభ్యాస = శిక్షణతో; చిత్ర = విచిత్రమైన; సంగతులన్ = యుక్తులతో; మెఱసి = ప్రకాశించి; కురుకుమారులన్ = కౌరవులను; భూరి = అత్యంత గొప్ప; సంగరము = యుద్ధము; లోనన్ = లో; హతులన్ = సంహరింపబడినవారిగా; కావించి = చేసి; వెలసిన = ప్రకాశించిన; అట్టి = అటువంటి; జెట్టి = వీరుడు; వాయుతనయుండు = భీముడు {వాయుతనయుడు - వాయుదేవుని కుమారుడు, భీముడు}; కుశలి = కుశలముగా ఉన్నవాడు; ఐ = అయి; వఱలున్ = ప్రసిద్ధిచెందునా; అయ్యా = తండ్రీ.

భావము:

గొప్పగా అబ్యాసం చేసిన గదాయుద్ధ విచిత్ర విన్యాసాల కౌశలంతో అతిశయించి, కౌరవులను రణరంగంలో మట్టుపెట్టిన జగజెట్టి వాయుదేవుని పుత్రుడు భీముడు క్షేమంగా ఉన్నాడా?