పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-58-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రారాధన మాని కృష్ణుఁ గమలాధీశుం బయోజాసనా
ర్చితు భక్తిన్ నిజనాథుఁగా సతతమున్ సేవించు పుణ్యుల్ జగ
న్నుతు లధ్యాత్మ విదుల్మహాభుజులు మాన్యుల్ ధర్మమార్గుల్సము
న్నతి సత్యాత్మజ చారుదేష్ణ గదు లానందాత్ములే యుద్ధవా!

టీకా:

ఇతర = ఇతరమైన; ఆరాధనము = సేవించుటలు; మాని = మానేసి; కృష్ణున్ = కృష్ణుని; కమలాధీశున్ = కృష్ణుని {కమలాధీశుడు - లక్ష్మీపతి, విష్ణువు}; పయోజాసనార్చితున్ = కృష్ణుని {పయోజాసనార్చితుడు - బ్రహ్మచేపూజింపబడువాడు, విష్ణువు}; భక్తిన్ = భక్తితో; నిజ = తన; నాథుగాన్ = ప్రభువుగా; సతతమున్ = ఎల్లప్పుడు; సేవించు = సేవిస్తుండే; పుణ్యుల్ = పుణ్యాత్ములు; జగత్ = లోకముచే; నుతులు = స్తుతింపబడువారు; అధ్యాత్మ = ఆత్మజ్ఞానము; విదులు = తెలిసినవారు; మహా = గొప్ప; భుజులు = భుజబలము కలవారు; మాన్యుల్ = గౌరవింపదగ్గవారు; ధర్మ = ధర్మమును; మార్గులు = అనుసరించువారు; సమున్నతిన్ = మిక్కిలి గొప్పదనముతో; సత్య = సత్యభామ యొక్క; ఆత్మజులు = పుత్రులు; చారుదేష్ణ = చారుదేష్ణుడు; గదులు = గదుడును; ఆనంద = సంతోషముతో; ఆత్ములే = కూడి ఉన్నారా; ఉద్ధవా = ఉద్ధవుడా.

భావము:

ఓ ఉద్ధవా! ఇతర దేవతా పూజలన్నీ విడిచిపెట్టి, బ్రహ్మదేవునికికూడ పూజనీయుడూ, లక్ష్మీపతీ అయిన శ్రీకృష్ణుణ్ణి తమకు రక్షకుడుగా భావించి భక్తితో నిత్యం సేవించే ధన్యులూ, పుణ్యాత్ములు, లోకంచే గౌరవింపబడువారూ, ఆధ్యాత్మిక విద్యావేత్తలూ, శక్తిసంపన్నులూ, మన్నింపదగినవారూ, ధర్మమార్గంలో నడిచేవారూ అయిన సత్యభామానందనులు, చారుధేష్ణ, గదులు సంతోషంగా ఉన్నారా.