పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-56-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రుతులునుఁ గ్రతుజాతము స
మ్మతిఁ దాల్చినయట్టి వేదమాతగతిన్ శ్రీ
తిఁ దనగర్భంబున ర
క్షితుఁ జేసిన గరిత దేవకీసతి సుఖమే.

టీకా:

శ్రుతులున్ = వేదములును; క్రతు = యజ్ఞముల; జాతమున్ = సమూహములును; సమ్మతిన్ = అంగీకారముతో; తాల్చిన = ధరించిన; అట్టి = అటువంటి; వేదమాత = గాయత్రి {వేదమాత - వేదములకు తల్లి వంటిది, గాయత్రి}; గతిన్ = వలె; శ్రీపతిన్ = కృష్ణుని {శ్రీపతి - లక్ష్మీదేవి భర్త, విష్ణుసహస్రనామాలలో 603వ నామం}; తన = తన; గర్భంబునన్ = గర్భమున; రక్షితున్ = కాపాడబడినవానిగ; చేసిన = చేసినట్టి; గరిత = పతివ్రత; దేవకీసతి = దేవకీదేవి; సుఖమే = సౌఖ్యముగ ఉన్నదా.

భావము:

వేదాలనూ యజ్ఞాలనూ సాదరంగా తనలో దాచుకొన్న వేదమాతలా శ్రీమన్నారాయణుణ్ణి తన గర్భంలో ఆప్యాయంగా ధరించి కాపాడిన దొడ్డ ఇల్లాలు దేవకీదేవి సుఖంగా ఉందా?