పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-55-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాతాంకుశ చక్ర చాప కులిశచ్ఛత్రాది రేఖాంకితో
జ్జ్వ గోవింద పదాబ్జ లక్షిత విరాన్మార్గ ధూళిచ్ఛటా
లితాంగుండు విధూతకల్మషుఁడు నిష్కామైక ధర్ముండు స
త్కుజాతుండన నొప్పు నట్టి ఘనుఁ డక్రూరుండు భద్రాత్ముఁడే?

టీకా:

జలజాత = పద్మము; అంకుశ = అంకుశము; చక్ర = చక్రము; చాప = విల్లు; కులిశ = వజ్రము; ఛత్ర = గొడుగు; ఆది = మొదలైన; రేఖా = రేఖల; అంకిత = గుర్తులు; తోన్ = తో; ఉజ్జ్వల = ప్రకాశవంతమైన; గోవింద = కృష్ణుని {గోవిందుడు - గోవులకు నాయకుడు, కృష్ణుడు}; పద = పాదములను; అబ్జ = పద్మముల; లక్షిత = గురుతు వేయబడి; విరాజిత్ = విరాజిల్లుచున్న; మార్గ = త్రోవలందలి; ధూళి = దుమ్ము; చ్ఛటా = రేణువులచే; కలిత = కూడిన; అంగుడు = దేహముకలవాడు; విధూత = పోగోట్టబడిన; కల్మషుడు = పాపములు కలవాడు; నిష్కామ = కోరికలు లేకపోవుట అనుట; ఏక = మాత్రమే; ధర్ముండు = ధర్మముగా కలవాడు; సత్ = మంచి; కుల = వంశమున; జాతుండు = పుట్టినవాడు; అనన్ = అనగా; ఒప్పునట్టి = ఒప్పుచున్న; ఘనుడు = గొప్పవాడు; అక్రూరుండు = అక్రూరుడు; భద్ర = శుభమైన; ఆత్ముడే = మనసు కలవాడు.

భావము:

గోవులకు ఒడయుడు అయిన శ్రీకృష్ణుని పాదాలు పద్మం, అంకుశం, చక్రం, ధనుస్సు, వజ్రం, ఛత్రం మొదలైన శుభరేఖలతో ఒప్పి ఉంటాయి. అటువంటి శ్రీపాదముద్రలు ప్రకాశించే త్రోవలలోని దుమ్ముతో ధూసరితం అయిన నిండుదేహంతో, పాపరహితుడు అయిన అక్రూరుడు ఆనందంగా ఉన్నాడా? నిష్కాముడూ, ధర్మపరుడూ, సద్వంశ సంజాతుడూ అయిన ఆ మహానుభావునికి క్షేమమే కదా.