పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-54-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిపదసేవకుఁ డరి భీ
రుఁ డర్జును వలన మిగులఁ గార్ముక విద్యల్
దిముగఁ గఱచిన సాత్యకి
సుఖ విభవముల నున్నవాఁడె ధరిత్రిన్?

టీకా:

హరి = కృష్ణుని {హరి - సంచిత పాపములను హరించు వాడు, కృష్ణుడు}; పద = పాదములను; సేవకుడు = సేవించువాడు; అరి = శత్రువులకు; భీకరుడు = భయము కలిగించువాడు; అర్జును = అర్జునుని; వలన = వలన; మిగుల = మిక్కిలి; కార్ముక = విలు; విద్యల్ = విద్యలు; తిరముగ = స్థిరముగా; కఱచిన = నేర్చిన; సాత్యకి = సాత్యకి; వర = శ్రేష్ఠమైన; సుఖ = సౌఖ్యముల; విభవములన్ = వైభవములతో; ఉన్నవాడె = ఉన్నాడ; ధరిత్రిన్ = భూమిమీద.

భావము:

కృష్ణ చరణ కింకరుడూ, శత్రువుల పాలిటి భయంకరుడూ, అర్జునుని దగ్గర చక్కటి విలువిద్య నేర్చుకొన్నవాడూ అయిన సాత్యకి అత్యంత సుఖవైభవాలతో అలరారుతున్నాడా?