పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-53-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిత పతివ్రతామణి విలాసవతీతిలకంబు పార్వతీ
న గుమారుఁ గన్నటు సుక్షణ జాంబవతీ లలామ ని
ర్మ గతిఁ గన్న పట్టి సుకుమారతనుండు విరోధిభంజనో
త్కలిక సుఖించునే గుణకదంబుఁడు సాంబుఁడు వృష్ణిపుంగవా!

టీకా:

లలిత = లాలిత్యముగల; పతివ్రతా = పతివ్రతలలో; మణి = మణివంటిదియును; విలాసవతీ = శృంగారవతులలో, స్త్రీలలో; తిలకంబున్ = శ్రేష్ఠమైనదిను; పార్వతీ = పార్వతీ; లలన = దేవి; కుమారున్ = కుమారస్వామిని; కన్న = కనిన; అటు = విధముగ; సులక్షణ = మంచిలక్షణములు గలామె; జాంబవతీ = జాంబవతీ; లలామ = దేవి; నిర్మల = నిర్మలమైన; గతిన్ = విధముగ; కన్న = కనిన; పట్టి = కుమారుడు; సుకుమార = సుకుమారమైన; తనుండు = శరీరము కలవాడు; విరోధి = శత్రువులను; భంజన = భంగపరచు; ఉత్కలికన్ = ఉత్సాహ తరంగముతో; సుఖించునే = సౌఖ్యముగ ఉన్నాడా; గుణ = సుగుణముల; కదంబుడు = కలయికైనవాడు; సాంబుడు = సాంబుడు; వృష్ణిపుంగవా = ఉద్దవా {వృష్ణిపుంగవుడు - వృష్ణి వఁశమున శ్రేష్ఠుడు, ఉద్దవుడు}.

భావము:

వృష్ణివంశపు ఉత్తముడా! ఉద్దవా! పతివ్రతా శిరోమణీ, ఉత్తమ రమణీమణీ, సద్గుణవతీ అయిన జాంబవతి, పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్లు సాంబుని కన్నది. సుకుమారమైన దేహంగల అందగాడూ, విరోధులను చీల్చి చెండాడే వీరాధివీరుడు, సుగుణాలవాలుడు. ఆ సాంబుడు క్షేమమేనా?