పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-51-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంర్పాంశమునం దనూజుఁ బడయం గామించి భూదేవతా
బృందంబున్ భజియించి తత్కరుణ దీపింపం బ్రభావంబు పెం
పొందన్ రుక్మిణి గన్ననందనుఁడు ప్రద్యుమ్నుండు భాస్వచ్ఛమూ
సందోహంబులు దన్నుఁ గొల్వ మహితోత్సాహంబునన్ మించునే.

టీకా:

కందర్ప = మన్మథుని; అంశమునన్ = అంశము; అందు = తో; తనుజున్ = పుత్రుని; పడయన్ = పొందుటను; కామించి = కోరి; భూదేవతా = బ్రాహ్మణుల; బృందమున్ = సమూహమును; భజియించి = ఆరాధించి; తత్ = వారి; కరుణ = దయ; దీపింపన్ = ప్రకాశింపగ; ప్రభావంబు = ప్రభావము; పెంపొందన్ = వృద్ధికాగా; రుక్మిణి = రుక్మిణీదేవి; కన్న = కన్నటువంటి; నందనుడు = కొడుకు; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుడు; భాస్వత్ = ప్రకాశిస్తున్న; చమూ = సేనల; సందోహంబులు = సమూహములు; తన్నున్ = తనను; కొల్వ = కొలుచుచుండగా; మహిత = గొప్ప; ఉత్సాహంబునన్ = ఉత్సాహముతో; మించునే = అతిశయించుచున్నాడా.

భావము:

మన్మథుని అంశగల కుమారుణ్ణి పొందదలచి రుక్మిణీదేవి బ్రాహ్మణుల్ని పూజించింది, వారి అనుగ్రహం వల్ల అత్యంత మహిమోపేత అయిన రుక్మిణీమాత కన్న సంతానం ప్రద్యుమ్నుడు సమస్త సేనాసమూహం తనను సంసేవిస్తూ ఉండగా ఉత్సాహంతో ఉన్నాడుగదా!