పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-50-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కురుకులు లాదరింపఁగ సఖుండును నాప్తుఁడునై తనర్చి సో
తరుణీజనంబులనుఁ త్పతులం గడు గారవంబునం
రుణ దలిర్ప నాత్మజులకంటెఁ బ్రియోన్నతిఁ బ్రోచువాడు సు
స్థిమతి నున్నవాఁడె వసుదేవుఁడు వృష్ణికులప్రదీపకా!

టీకా:

కురు = కురు; కులులు = వంశస్తులు; ఆదరింపగన్ = ఆదరిస్తుండగా; సఖుడునున్ = మిత్రుడు; ఆప్తుడున్ = ఆపదలలో ఆదుకొనువాడు; ఐ = అయి; తనర్చి = అతిశయించి; సోదర = తోటి; తరుణీ = స్త్రీ; జనంబులన్ = జనములను; తత్ = వారి; పతులన్ = భర్తలను; కడు = మిక్కిలి; గారవంబున్ = ప్రేమ; కరుణన్ = దయ; తలిర్పన్ = వికసించగా; ఆత్మజుల = తన పుట్టిన వారి; కంటెన్ = కంటెను; ప్రియ = ప్రేమ యొక్క; ఉన్నతిన్ = ఉన్నతితో; ప్రోచు = కాపాడే; వాడు = వాడు; సుస్థిర = చక్కటి స్థిరమైన; మతిన్ = మనసుతో; ఉన్నవాడె = ఉన్నడా; వసుదేవుడు = వసుదేవుడు; వృష్ణికులప్రదీపకా = ఉద్ధవా {వృష్ణికులప్రదీపకుడు - వృష్ణి కులమును ప్రకాశింపజేయువాడు, ఉద్ధవుడు}.

భావము:

వృష్ణివంశాన్ని ప్రకాశవంతం చేయువాడ! ఉద్దవా! కురువంశీయులైన కౌరవులూ, పాండవులూ తనను ఎంతో గౌరవంగా చూస్తుండగా, నెయ్యమై, ఆప్తుడై తన చెల్లెళ్ళనూ, వారి భర్తలనూ ఎంతో ఆదరంగా ఆప్యాయంగా కన్నబిడ్డలకంటె మిన్నగా లాలించి పాలించే వసుదేవుడు ఆరోగ్యంగా ఉన్నాడా?