పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-42-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుగుచు దైత్యభేదన దయాపరిలబ్ధ సమస్త మేదినీ
ణధురందరుం డగుచుఁ బాండుసుతాగ్రజుఁ డొప్పుచుండ భూ
! విదురుండుఁ దన్నికటర్య తమాల రసాల మాధవీ
కువక మాలతీ వకుళ కుంజ లసత్తట మందు నున్నెడన్.

టీకా:

అరుగుచున్ = వస్తూ; దైత్యభేదన = కృష్ణుని {దైత్యభేదనుడు - రాక్షసులను సంహరించిన వాడు, కృష్ణుడు}; దయా = దయచేత; పరి = చక్కగా; లబ్ధ = లభించిన; సమస్త = సమస్తమైన; మేదినీ = భూమిని; భరణ = భరించుట యందు; ధురంధరుండు = మిక్కిలి నేర్పరి; అగుచున్ = అవుతూ; పాండుసుతా = పాండవులలో {పాండుసుతులు - పాండురాజు యొక్క పుత్రులు, పాండవులు}; అగ్రజుడు = పెద్దవాడు {అగ్రజుడు – ముందు పుట్టినవాడు, పెద్దవాడు}; ఒప్పుచుండన్ = చక్కగా ఉండగా; భూవర = రాజా {భూవరుడు - భూమికి వరుడు, రాజు}; విదురుండు = విదురుడు; తత్ = ఆ; నికట = దగ్గరి; వర్య = శ్రేష్ఠమైన; తమాల = కానుగచెట్లు; రసాల = మామిడిచెట్లు; మాధవీ = మాధవీ పూలతీగలు; కురవక = ఎఱ్ఱగోరింటచెట్లు; మాలతీ = మాలతీపూలతీగలు; వకుళ = పొగడచెట్లు; కుంజ = పొదరిళ్ళతో; లసత్ = ప్రకాశిస్తున్న; తటము = ఏటివొడ్డు, ప్రదేశము; అందున్ = అందు; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమున;

భావము:

. రాజా! అలా వస్తున్న విదురుడు ఆ పరిసర ప్రాంతంలోని మద్దిచెట్లూ, మామిడిచెట్లు గురివెంద, ఎఱ్ఱగోరింట, మాలతి, పొగడ మొదలైన తరులతాదులతో కూడి ఉన్న నదీ తీరంలో విదురుడు ఆగి ఉన్నాడు. ఆ సమయంలో రాక్షససంహారుడు శ్రీకృష్ణభగవానుని అనుగ్రహం వల్ల లభించిన సామాజ్ర్యాన్ని ధర్మరాజు పరిపాలిస్తున్నాడు, సమస్త మహిమండలభారాన్ని చక్కగా వహిస్తున్నాడు.