పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల హరి స్తుతి

  •  
  •  
  •  

3-553-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని సనకాదులు దత్పద
జములకు మ్రొక్కి భక్తిశమానసులై
వినిపించిన గోవిందుఁడు
మునివరులం జూచి పలికె ముదితాత్ముండై.

టీకా:

అని = అని; సనక = సనకుడు; ఆదులు = మొదలగువారు; తత్ = ఆతని; పద = పాదములు అనెడి; వనజముల్ = పద్మముల {వనజము - వనము (నీటి)లో జము(పుట్టునవి), పద్మము}; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; భక్తి = భక్తికి; వశమానసులు = వశమైన మనసు కలవారు; ఐ = అయ్యి; వినిపించిన = పలికిన; గోవిందుడు = నారాయణ {గోవిందుడు - గో( జీవుల)కు ఒడయుడు, విష్ణువు}; ముని = మునులలో; వరులన్ = శ్రేష్ఠులను; చూచి = చూసి; పలికె = పలికెను; ముదిత = సంతోషించిన; ఆత్ముడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; ఈ = ఈ.

భావము:

అని ఈ విధంగా సనక సనందనాదులు శ్రీహరి పాదపద్మాలకు మ్రొక్కి భక్తితో పరవశమైన మనస్సు కలవారై విన్నవించారు. గోవిందుడు సంతోషించి ఆ మునీశ్వరులను చూసి ఇలా అన్నాడు.