పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల హరి స్తుతి

  •  
  •  
  •  

3-549-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మతపో విధూత భవపాపులమై చరియించు మాకు నేఁ
య భవత్పదాశ్రితుల ల్గి శపించిన భూరి దుష్కృత
స్ఫుణ నసత్పథైక పరిభూతులమై నిజధర్మహానిగా
నియము నొందఁగావలసె నేరము వెట్టక మమ్ముఁ గావవే.

టీకా:

పరమ = ఉత్తమమైన; తపస్ = తపస్సువలన; విధూత = పోగొట్టబడిన; భవ = సాంసారిక; పాపులము = పాపములు కలవారము; ఐ = అయ్యి; చరియించు = వర్తించుచుండు; మాకున్ = మాకు; నేడు = ఈరోజు; అరయ = చూడగా; భవత్ = నిన్ను; ఆశ్రితులన్ = ఆశ్రయించిన వారిని; అల్గి = కోపించి; శపించిన = శాపము పెట్టిన; భూరి = అతిమిక్కిలి; దుష్కృత = చెడ్డపనిగా; స్ఫురణన్ = వ్యక్తమగుచున్న; అసత్ = చెడు; పథ = మార్గములలో; ఏక = ప్రముఖమైనదానిని; పరిభూతులము = పట్టినవారము; ఐ = అయ్యి; నిజ = స్వీయ; ధర్మ = ధర్మమునకు; హానిగా = కలిగినభంగమువలన; నిరయమున్ = నరకమును; ఒందన్ = పొంద; వలసె = వలసి వచ్చినది; నేరము = తప్పు; పెట్టక = పట్టక; మమ్మున్ = మమ్ములను; కావవే = కాపాడుము.

భావము:

అంతులేని తపస్సు చేసి సాంసారిక పాపాలను పోగొట్టుకొని తిరిగే మేము ఈరోజు నీ పాదదాసులపై కోపించి శపించాము. మహాపాపాన్ని కల్గించే చెడుమార్గంలో అడుగుపెట్టి ధర్మహాని చేసి నరకానికి పాత్రుల మయ్యాము. మా తప్పు మన్నించి మమ్మల్ని రక్షించు.