పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల హరి స్తుతి

  •  
  •  
  •  

3-548-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున గీర్తనీయ గతల్మష మంగళ తీర్థ కీర్తి సు
శ్రీవిభవప్రశస్త సుచరిత్రుఁడ వైన భవత్పదాబ్జ సే
వా విమలాంతరంగ బుధర్గ మనర్గళభంగి నన్యమున్
భామునం దలంచునె కృపాగుణభూషణ! పాపశోషణా!

టీకా:

కావున = అందుచేత; కీర్తనీయ = స్తుతించదగ్గ; గత = పోగొట్టబడిన; కల్మష = పాపములు; మంగళ = శుభకరమైన; తీర్థ = పావనకరమైన; కీర్తి = యశస్సు; సుశ్రీ = మంచిసౌభాగ్యము; విభవ = వైభవములతో; ప్రశస్త = గొప్ప; సుచరిత్రుడవు = మంచి చరిత్ర గలవాడవు; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అబ్జ = పద్మముల {అబ్జము - నీటపుట్టినది, పద్మము}; సేవా = సేవించు; విమల = నిర్మలమైన; అంతరంగ = మనసులు కల; బుధ = జ్ఞానుల; వర్గము = సముదాయము; అనర్గళ = ఎడతెగని; భంగిన్ = విధముగ; అన్యమున్ = ఇతరమైన; భావమునన్ = మనసులో; తలంచునె = తలుస్తారా ఏమి; కృపాగుణభూషణ = నారాయణ {కృపా గుణ భూషణుడు - దయాగుణమే అలంకారముగ కలవాడు, విష్ణువు}; పాపశోషణా = పాపములను పోగొట్టువాడు.

భావము:

దయాగుణమే అలంకారంగా గలవాడా! పాపాలను తొలగించేవాడా! పొగడ దగినదీ, దోషాలు లేనిదీ, శుభగుణాలకు కాణాచియైనదీ, గొప్ప కీర్తిచేత విరాజిల్లేదీ అయిన పవిత్రమైన చరిత్ర కలవాడవు. నీ పాదపద్మాల సేవచేత నిర్మలమైన మనస్సు కల మహానుభావులు ఇతర విషయాలను భావించరు.