పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల హరి స్తుతి

  •  
  •  
  •  

3-546.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విదిత దృఢభక్తియోగ ప్రవీణు లగుచు
ర్థిమై వీతరాగు లైట్టి యోగి
నమనః పంకజాత నిణ్ణమూర్తి
ని యెఱుంగుదురయ్య! నిన్నాత్మ విదులు.

టీకా:

దేవ = నారాయణ {దేవుడు - భగవంతుడు, విష్ణువు}; దుర్జనుల్ = చెడ్డవారి; కున్ = కి; భావింపన్ = పరిశీలించిన; హృదయ = హృదయము; సంగతుడవు = లోపల ఉండువాడవు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉండినప్పటికిని; కానఁబడవు = కనబడవు; కడగి = పూని; నీ = నీ; దివ్య = దివ్యమైన; మంగళ = శుభప్రధమైన; విగ్రహంబున్ = స్వరూపము; చేసి = వలన; సమంచిత = చక్కటి పూజనీయులైన; ఆశ్రితులన్ = ఆశ్రితులను; ఎల్లన్ = అందరను; చేకొని = చేపట్టి; సంప్రీతి = సంతృప్త; చిత్తులన్ = మనసుకలవారిని; కాన్ = అగునట్లు; చేయుదు = చేసెదవు; అతిశయ = అత్యధికమైన; కారుణ్య = దయగల; మతిన్ = మనసుతో; తనర్చి = విజృంభించి; కమలాక్ష = నారాయణ {కమలాక్షుడు - కమలముల వంటి కన్నులున్నవాడు, విష్ణువు}; సర్వలోకప్రజాధిప = నారాయణ {సర్వలోకప్రజాధిపుడు - సమస్తమైన లోకముల ప్రజలకును ప్రభువు, విష్ణువు}; భవత్ = నిన్ను; అనుసరణ = అనువర్తించు; అభిలాష = కోరిక; అనులాప = మననము వలని;
విదిత = స్పష్టమైన; దృఢ = గట్టి; భక్తియోగ = భక్తియోగమున; ప్రవీణులు = మిక్కిలినేర్పుకలవారు; అగుచున్ = అవుతూ; అర్థిమై = కోరి; వీతరాగులము = వైరాగ్యముకలవారము; ఐనట్టి = అయినటువంటి; యోగి = యోగులైన; జన = జనుల యొక్క; మనస్ = మనసు అను; పంకజాతన్ = పద్మమున; నిషణ్ణమూర్తివి = నివసించువాడవు; అని = అని; యెఱుగుదురు = తెలియుదురు; అయ్య = తండ్రి; నిన్ను = నిన్ను; ఆత్మవిదులు = ఆధ్యాత్మికవేత్తలు {ఆత్మవిదులు - పరమాత్మ విద్య తెలిసినవారు, ఆధ్యాత్మికవేత్తలు}.

భావము:

దేవా! నీవు దుష్టుల హృదయాలలో ఉండికూడ వారికి కనిపించవు. పట్టుదలతో నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఆశ్రయించి ఆరాధించేవారిని అంతులేని దయతో చేరదీసి వారి మనస్సులను తృప్తి పరుస్తావు. పద్మనయనా! సర్వలోకాధిపతీ! నిన్ను చూడాలనే కోరిక కలగడం వల్లా, నీ గురించి చెప్పుకొనడం వల్ల, సుస్థిరమైన భక్తియోగంలో నిష్ణాతులైన ఆత్మవిదులైనవారు రాగద్వేషాలు తొలగించుకున్నట్టి యోగిజనుల మనస్సులనబడే పద్మాలలో నీవు కూర్చుని ఉంటావని తెలుసుకుంటారు.