పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల హరి స్తుతి

  •  
  •  
  •  

3-545-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జదళాక్ష! భక్తజనత్సల! దేవ! భవత్సుతుండు మ
జ్జకుఁడు నైన పంకరుహజాతుడు మాకు రహస్య మొప్పఁ జె
ప్పి భవదీయ మంగళగభీరపరిగ్రహ విగ్రహంబు మే
యముఁ జూడఁ గంటిమి కృతార్థులమై తగ మంటి మీశ్వరా!

టీకా:

వనజదళాక్ష = నారాయణ {వనజ దళాక్షుడు - వనజ (పద్మము) యొక్క దళ (రేకు) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; భక్తవత్సల = నారాయణ {భక్త వత్సలుడు - భక్తుల ఎడ వాత్సల్యముకలవాడు, విష్ణువు}; దేవ = నారాయణ {దేవుడు - భగవంతుడు, విష్ణువు}; భవత్ = మీకు; సుతుండు = పుత్రుడు; మత్ = మాకు; జనకుడున్ = తండ్రియు; ఐన = అయిన; పంకరుహజాతుడు = బ్రహ్మదేవుడు {పంకరుహ జాతుడు - పంకరుహము (పద్మము)నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; మాకు = మాకు; రహస్యము = దాచుకొనుటకు; ఒప్పన్ = ఒప్పియుండునట్లుగా; చెప్పిన = చెప్పినట్టి; భవదీయ = నీ యొక్క; మంగళ = శుభకరమైన; గభీర = గంభీరమైన; పరిగ్రహ = స్వీకరించిన; విగ్రహంబున్ = స్వరూపమును; మేము = మేము; అనయంబు = తప్పక; చూడగంటిమి = చూడగలిగితిమి; కృతార్థులము = ధన్యులము; ఐ = అయ్యి; తగ = చక్కగా; మంటిమి = బతికితిమి; ఈశ్వరా = నారాయణుడా {ఈశ్వరుడు - ఫ్రభువు, విష్ణువు}.

భావము:

“పద్మదళాల వంటి నేత్రాలు కలిగినవాడా! భక్తజనులపై వాత్సల్యాన్ని చూపే దేవా! నీ కుమారుడూ, మాకు జనకుడూ అయిన బ్రహ్మదేవుడు మాకు ఉపదేశించిన ఉపాయంతో నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలిగాము. ప్రభూ! కృతార్థులమైన మా జన్మ సార్థకమయింది.