పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల హరి స్తుతి

  •  
  •  
  •  

3-544-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుం; జక్షురింద్రియగ్రాహ్యం బగు దివ్యమంగళవిగ్రహంబు ధరియించి యున్న పురుషోత్తము నుదాత్తతేజోనిధిం జూచి సనకాదు లిట్లని స్తుతియించిరి.

టీకా:

మఱియు = ఇంకను; చక్షుః = చూచు; ఇంద్రియ = ఇంద్రియమునకు; గ్రాహ్యంబు = గ్రహించగలది; అగు = అయిన; దివ్య = దివ్యమైన; మంగళ = శుభప్రదమైన; విగ్రహంబు = స్వరూపము; ధరియించి = ధరించి; ఉన్న = ఉన్నట్టి; పురుషోత్తమున్ = నారాయణుని {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; ఉదాత్తతేజోనిధిన్ = నారాయణుని {ఉదాత్త తేజోనిధి - గొప్పతేజస్సునకు నిధివంటివాడు, విష్ణువు}; చూచి = చూసి; సనక = సనకుడు; ఆదులు = మొదలగువారు; ఇట్లని = ఈ విధముగ; స్తుతియించిరి = స్తోత్రము చేసిరి.

భావము:

కన్నులకు విందు కావించే దివ్యమంగళ స్వరూపాన్ని ధరించిన ఆ మహానుభావుడు, పురుషోత్తముడు, అనంత తేజోనిధి అయిన విష్ణువును సనకసనందనాదులు ఇలా సంస్తుతించారు.