పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : శ్రీహరి దర్శనంబు

  •  
  •  
  •  

3-542-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని నఖ పద్మరాగమణి కాంతివిభాసిత పాదపద్మము
ల్మముల యందుఁ గీల్కొలిపి బ్దమనోరథ యుక్తు లై పునః
పురభివందనంబులు విభూతి దలిర్ప నొనర్చి యోగమా
ర్గనిరత చిత్తులున్ వెదకి కానఁగలేని మహానుభావునిన్.

టీకా:

కని = చూసి; నఖ = గోర్లు అనెడి; పద్మరాగ = పద్మరాగము అను; మణి = రత్నముల; కాంతి = ప్రకాశముచే; విభాసిత = విలసిల్లుతున్న; పాద = పాదములు అనెడి; పద్మముల్ = పద్మములను; మనముల = మనసుల; అందున్ = లో; కీల్కొలిపి = హత్తించుకొని; లబ్ధ = లభించిన; మనోరథ = కోరికలుతో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి; పునఃపునః = మరలమరల; అభివందనంబులున్ = చక్కటి నమస్కారములు; విభూతిన్ = వైభవములు; తలిర్పన్ = చిగురొత్తగా; ఒనర్చి = చేసి; యోగ = యోగ; మార్గ = విధానములో; నిరత = లగ్నమైన; చిత్తులున్ = మనసులు కలవారైనను; వెదకి = వెదకియును; కానగలేని = చూడలేని; మహానుభావునిన్ = గొప్పవానిని.

భావము:

కోరిక తీరిన ఆ సనక సనందాది మహర్షులు నిరంతరం యోగమార్గాసక్తులైన మహాయోగులు సైతం ఎంత వెదకినా కనిపించని మహానుభావుడైన విష్ణువును కన్నులారా చూసారు. పద్మరాగ మణుల కాంతులతో ప్రకాశించే ఆ భగవంతుని పాదపద్మాలను తమ హృదయాలలో పదిలపరచుకొని పదేపదే నమస్కారాలు చేశారు.