పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : శ్రీహరి దర్శనంబు

  •  
  •  
  •  

3-534-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిధికన్యకామణియు సంభ్రమ మొప్పఁగఁ దోడరా మనో
నిజ లీలమైఁ బరమహంస మునీశ్వర వంద్య పాదపం
రుహములన్ వినూత్న మణికాంచన నూపుర మంజు ఘోషముల్
రుసఁ జెలంగ నార్యజనవంద్యుఁడు యోగిజనైకసేవ్యుఁడై.

టీకా:

శరనిధికన్యకామణియు = లక్ష్మీదేవియును {శరనిధి కన్యకామణి - శరము (నీరు) కి నిథి వంటివాని, సముద్రుని కన్యకామణి (శ్రేష్ఠమైన పుత్రిక), లక్ష్మీదేవి}; సంభ్రమము = ఆశ్చర్యము; ఒప్పన్ = కలుగగా; తోడన్ = కూడా; రాన్ = వస్తుండగా; మనోహర = మనోహరమైన; నిజ = తన; లీలమై = లీలతో; పరమహంస = పరమహంసలచేత {పరమహంస - సన్యాస ఆశ్రమమున ఉత్తమ పదమును పొందినవాడు}; ముని = మునులలో; ఈశ్వర = శ్రేష్ఠులచేత; వంద్య = నమస్కరింపబడు; పాద = పాదములు అనెడి; పంకరుహములన్ = పద్మములను {పంకరుహము - నీట పుట్టునది, పద్మము}; వినూత్న = సరికొత్త; మణి = మణులు పొదిగిన; కాంచన = బంగారు; నూపుర = అందెల; మంజు = మృదువైన; ఘోషముల్ = సవ్వడి; వరుసన్ = క్రమముగా; చెలంగన్ = చెలరేగగా; ఆర్య = పూజ్యులైన; జన = జనులచే; వంద్యుడు = సేవింపబడువాడు; యోగి = యోగులైన; జన = జనులు; ఏక = అందరకును; సేవ్యుండు = సేవింపబడువాడు; ఐ = అయ్యి.

భావము:

లక్ష్మీదేవి కూడా తొట్రుపాటు కలిగినదై వెంట రాగా, పరమహంసలైన మునీశ్వరులు నమస్కరించే తమ పాదపద్మాలకున్న క్రొత్త మణులు పొదిగిన బంగారు అందెలు అడుగడుగుకూ మనోహరమైన శబ్దాలు చేస్తుండగా శ్రీహరి మహానుభావులచేత నమస్కరింపబడేవాడై, యోగులచేత సేవింపబడేవాడై శ్రీహరి వచ్చాడు.