పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : శ్రీహరి దర్శనంబు

  •  
  •  
  •  

3-532-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి సర్వేశుఁ డనంతుఁ డా కలకలం బాలించి పద్మాలయా
సాలాపవినోద సౌఖ్యరచనల్ చాలించి శుద్ధాంత మం
ది మాణిక్య సుగేహళుల్ గడచి యేతెంచెం బ్రపన్నార్తి సం
రుఁడై నిత్యవిభూతిశోభనకరుండై మానితాకారుఁడై.

టీకా:

హరి = విష్ణుమూర్తి; సర్వేశుడు = విష్ణుమూర్తి {సర్వేశుడు - సర్వులకును ఈశుడు (ప్రభువు), విష్ణువు}; అనంతుడు = విష్ణుమూర్తి {అనంతుడు - అంతములేనివాడు, విష్ణువు}; ఆ = ఆ; కలకలంబున్ = రొదను; ఆలించి = విని; పద్మాలయా = లక్ష్మీదేవితో {పద్మాలయ - పద్మములను నివాసముగా కలామె, లక్ష్మీదేవి}; సరస = సరసమైన; ఆలాప = మాటలాడు కొను; వినోద = వినోదించుట యందలి; సౌఖ్యరచనల్ = సుఖ సంభాషణలను; చాలించి = ఆపివేసి; శుద్దాంతమందిర = అంతఃపురము యొక్క {శుద్దాంత మందిరము - శుద్ద (స్వచ్ఛమైన) అంత (లోని) మందిరము (భవనము), అంతఃపురము}; మాణిక్య = మాణిక్యములు పొదిగిన; సు = మంచి; గేహళుల్ = గడపలు; కడచి = దాటుకొని; ఏతెంచెన్ = వచ్చెను; ప్రపన్న = ఆశ్రయించినవారి; ఆర్తి = బాధలను; సంహరుడు = నిర్మూలించువాడు; ఐ = అయ్యి; నిత్య = శాశ్వతమైన; విభూతిన్ = వైభవముతో; శోభన = శుభములను; కరుండు = కలిగించువాడు; ఐ = అయ్యి; మానిత = పూజింపబడు; ఆకారుండు = స్వరూపము కలవాడు; ఐ = అయ్యి.

భావము:

అందరికీ ప్రభువైనవాడూ, అంతములేనివాడూ అయిన హరి ఆ కలకలాన్ని విని, లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చేస్తూ వినోదించడాన్ని చాలించి, ఆశ్రయించినవారి కష్టాలను పోగొట్టేవాడై, శాశ్వత వైభవంతో శుభాలను కలిగించేవాడై అంతఃపురం యొక్క మాణిక్యాలు పొదిగిన మందిర ద్వారాలను దాటి మాననీయ స్వరూపంతో వచ్చాడు.