పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల శాపంబు

  •  
  •  
  •  

3-526-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రితాపంబును బొందుచు
సిజలోచనుని భటులు నకాది మునీ
శ్వరుల పదాంబుజములకుం
మర్థిన్ మ్రొక్కి నిటలటితాంజలు లై.

టీకా:

పరితాపంబున్ = బాధ; పొందుచున్ = పడుతూ; సరసిజలోచనుని = విష్ణుని {సరసిజలోచనుడు - సరసిజముల (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; భటులు = భృత్యులు; సనకాది = సనకుడు మొదలగు {సనకాది - సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అను బ్రహ్మదేవుని కుమారులు}; ముని = మునులలో; ఈశ్వరుల = శ్రేష్ఠుల; పాద = పాదములు అనెడి; అంబుజముల్ = పద్మములు; కున్ = కి; కరము = మిక్కిలి; అర్థిన్ = శ్రద్దతో; మ్రొక్కి = నమస్కరించి; నిటల = నొసట; ఘటిత = హత్తించిన; అంజలులు = మోడ్చిన చేతులు కలవారు; ఐ = అయ్యి.

భావము:

ఆ విష్ణుభటులు పరితాపం పొంది సనకాది మునుల పాదాలకు భక్తితో మ్రొక్కి, నుదుట చేతులు జోడించి...