పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల శాపంబు

  •  
  •  
  •  

3-525-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాలు విని తమ మనములు
భూరిస్ఫుట చండకాండపూగంబులచే
వారింపరాని భూసుర
దారుణవాక్యముల కులికి ల్లడపడుచున్.

టీకా:

వారలున్ = వారు; విని = విని; తమ = తమయొక్క; మనములు = మనసులు; భూరి = బహుమిక్కిలి; స్ఫుట = గట్టి; చండ = భయంకరమైన; కాండ = బాణముల; పూగంబులన్ = సమూహముల; చేన్ = చేతనూ; వారింపరాని = వారింపలేని; భూసుర = బ్రాహ్మణుల; దారుణ = కఠినమైన; వాక్యముల్ = పలుకుల; కున్ = కి; ఉలికి = ఉలికిపడి; తల్లడపడుచున్ = తల్లడిల్లుచూ.

భావము:

ఆ ద్వారపాలకులు పదునైన దారుణ బాణాలతో కూడ వారింపరాని వారి మాటలు విని ఉలిక్కిపడి తల్లడిల్లారు.