పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల శాపంబు

  •  
  •  
  •  

3-521-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారించిన వారలు బృం
దాకు లీక్షించుచుండ దారుణ పటు రో
షారుణితాంబకులై రొద
వారించుచు వారు నచటివారును వినగన్.

టీకా:

వారించినన్ = అడ్డగించిన; వారలున్ = వారు; బృందారకులు = దేవతలు; ఈక్షించుచున్ = చూస్తూ; ఉండగన్ = ఉండగా; దారుణ = భయంకరమైన; పటు = మిక్కిలి; రోషా = కోపముతో; అరుణిత = ఎఱ్ఱబారిన; అంబకులు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; రొదన్ = కలకలమును; వారించుచున్ = అడ్డుకొనుచూ; వారు = వారును; అచటి = అక్కడి; వారున్ = వారును; వినగన్ = వింటుండగా.

భావము:

అలా అడ్డగించగా ఆ సనకాది యోగులు కోపంతో ఎరుపెక్కిన కన్నులు కలవారై, దేవతలు చూస్తుండగా కలకలాన్ని వారిస్తూ అక్కడున్నవారంతా వింటూ ఉండగా...