పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల శాపంబు

  •  
  •  
  •  

3-520-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీలనేశ్వరదర్శన
లాసు లై యేఁగు బుధలలాముల నతి దు
శ్శీతఁ దద్వచనప్రతి
కూమతిం బోవకుండఁ గుటిలాత్మకు లై.

టీకా:

శ్రీలలనేశ్వర = విష్ణుని {శ్రీలల నేశ్వరుడు - శ్రీ (లక్ష్మీ) లలన (దేవి) యొక్క ఈశ్వరుడు (భర్త), విష్ణువు}; దర్శన = దర్శనము కై; లాలసులు = మిక్కిలి ఆసక్తికలవారు; ఐ = అయ్యి; ఏగు = వెళ్ళుతున్న; బుధ = జ్ఞానులలో; లలాములన్ = శ్రేష్ఠులన్; అతి = మిక్కిలి; దుశ్శీలతన్ = చెడు ప్రవర్తనముతో; తత్ = వారి; వచన = మాటలకు; ప్రతికూల = వ్యతిరేక; మతిన్ = విధముగా; పోవకుండన్ = వెళ్లనీయక; కుటిల = వక్ర; ఆత్మకుల్ = బుద్ధి కలవారు; ఐ = అయ్యి;

భావము:

శ్రీనాథుని దర్శించాలనే ఆసక్తితో వెళ్తున్న ఆ యోగులను దుష్టస్వభావం కల ఆ ద్వారపాలకులు కుటిలబుద్ధితో, ప్రతికూల వాక్కులతో పోకుండా అడ్డగించారు.