పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల శాపంబు

  •  
  •  
  •  

3-519-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధీతఁ బంచాబ్దముల కు
మాకు లై కానఁబడుచు నమున శంకం
గూక చతురాత్మకు లని
వారిత గమనముల డాయచ్చిన నెదురన్.

టీకా:

ధీరతన్ = బుద్ధి శక్తి కలిగి; పంచ = ఐదు (5); అబ్దముల = సంవత్సరముల వయసుకల; కుమారకులు = పిల్లలు; ఐ = అయ్యి; కానబడుచున్ = కనబడుతూ; మనమునన్ = మనసులో; శంకన్ = అనుమానమేమియును; కూరక = పొందక, పడక; చతుర = మనోహరమైన; ఆత్మకుల్ = స్వరూపము కలవారు; అనివారిత = వారింపరాని; గమనములన్ = వేగములతో; డాయన్ = దగ్గరకు; వచ్చిన = వచ్చిన; ఎదురన్ = ఎదురుగా.

భావము:

చతురమతులైన ఆ సనకాదులు ఐదేండ్ల బాలురవలె కనిపిస్తూ అనుమానించకుండా నిరాటంకంగా ఆ ద్వారపాలకులను సమీపించారు.