పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల శాపంబు

  •  
  •  
  •  

3-518-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాంచన నవరత్న టకాంగుళీయక-
హార కేయూర మంజీర ధరులఁ
మనీయ సౌరభాత మత్త మధుకర-
లిత సద్వనమాలికా విరాజి
తోరస్థ్సలుల గదాయుతులను ఘనచతు-
ర్భాహుల నున్నతోత్సాహమతుల
నారూఢ రోషానలారుణితాక్షుల-
భ్రూతా కౌటిల్య ఫాతలుల

3-518.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేత్రదండాభిరాముల వెలయు నమ్ము
కుంద శుద్దాంత మందిరాళింద భూమి
నున్న యిద్దఱన్ సనకాది యోగివరులు
సూచుచును వృద్దు లయ్యు నాసుభగమతులు.

టీకా:

కాంచన = బంగారము; నవరత్న = నవరత్నముల తోచేసిన {నవరత్నములు - తొమ్మిది జాతుల మణులు, 1 మౌక్తికము (ముత్యము) 2 పద్మరాగము (కెంపు) 3 వజ్రము 4 ప్రవాళము (పగడము) 5 మరకతము (గరుడ పచ్చ, పచ్చ) 6 నీలము 7 గోమేధికము 8 పుష్యరాగము 9 వైడూర్యము}; కటక = కంకణములు; అంగుళీయక = ఉంగరములు; హార = హారములు, దండలు; కేయూర = భుజకీర్తులు; మంజీర = అందెలను; ధరలు = ధరించిన వారు; కమనీయ = ఇంపైన; సౌరభ = సువాసనలకు; ఆగత = ఆకర్షింపబడి; మత్త = పరవశించిన; మధుకర = తేనెటీగలచే; కలిత = కూడిన; సత్ = మంచి; వన = పూల; మాలికా = మాలలచే; విరాజిత = విలసిల్లుతున్న; ఉరస్థ్సలుల = వక్షస్థలములు కలవారిని; గదా = గదలతో; యుతులను = కూడినవారిని; ఘన = పెద్దపెద్ద; చతుర్ = నాలుగు (4); బాహులన్ = చేతులున్నవారిని; ఉన్నత = మిక్కిలి; ఉత్సాహ = ఉత్సాహముతోకూడిన; మతులన్ = మనసులుకలవారిని; ఆరూఢ = ఉదయించిన; రోషా = కోపము అను; అనల = అగ్నితో; అరుణిత = ఎఱ్ఱబారిన; అక్షులన్ = కన్నులు కలవారిని; భ్రూ = కనుబొమలు; లతా = తీగలవలె; కౌటిల్య = వంకరలుతిరిగిన; ఫాలతలులన్ = నుదురులు కలవారిని;
వేత్ర = ఫేము; దండ = బెత్తములతో; అభిరాములన్ = అతిశయిస్తున్న వారిని; వెలయున్ = ప్రకాశిస్తున్న; ఆ = ఆ; ముకుంద = విష్ణుని; శుద్దాంత = అంతపుర; మందిర = మందిరమునకు; అళింద = దగ్గరి; భూమిన్ = స్థలములో; ఉన్న = ఉన్నట్టి; ఇద్దఱన్ = ఇద్దరిని; సనకాది = సనకుడు మొదలగు; యోగి = యోగులలో; వరులు = శ్రేష్ఠులు; చూచుచున్ = చూస్తూ; వృద్ధులు = పెద్దవారు; అయ్యున్ = అయినప్పటికిని; ఆ = ఆ; సుభగ = సౌభాగ్యముకల; మతులున్ = మనసులు కలవారు.

భావము:

ఆ ద్వారపాలకు లిద్దరూ నవరత్నాలు పొదిగిన బంగారు కంకణాలు, ఉంగరాలు, హారాలు, భుజకీర్తులు, కాలి అందెలు ధరించి ఉన్నారు. ఇంపైన సువాసనలతో గండుతుమ్మెదలను ఆకర్శించే మేలుజాతి పూలదండలను వక్షస్థలాలపై అలంకరించుకొని ఉన్నారు. గదలు పట్టుకొని చతుర్భుజాలతో ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. వారి కళ్ళు రోషాగ్నితో ఎఱ్ఱబడి ఉన్నాయి. వారి ఫాలభాగాలు ముడిపడ్డ కనుబొమలతో వంకరలు తిరిగి ఉన్నాయి. వారి హస్తాలలో పేము బెత్తాలు కదులుతున్నాయి. ఆ విధంగా వారిద్దరూ ముకుందుని శుద్ధాంతమందిరం ముందు నిలబడి ఉన్నారు. వృద్ధులై కూడ సనకాది యోగులు శుద్ధమైన మనస్సు కలవారై....