పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల వైకుంఠ గమనంబు

  •  
  •  
  •  

3-511-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱియు సరోరుహోదరుని మంగళదివ్యకథానులాప ని
ర్భ పరితోష బాష్ప కణ బంధుర చారు కపోల గద్గద
స్వ పులకీకృతాంగు లగువారలు నిస్పృహచిత్తు లత్యహం
ణవిదూరు లుందురు సుర్ముల యుండెడి పుణ్యభూములన్.

టీకా:

మఱియున్ = ఇంకనూ; సరోరుహోదరుని = విష్ణుని {సరోరు హోదరుడు - సరోరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; మంగళ = శుభకరమైన; దివ్య = దివ్యమైన; కథా = కథలను; అనులాప = ధ్యానించుట చే; నిర్భర = పట్టరాని; పరితోష = సంతోషపూర్వక; బాష్ప = కన్నీటి; కణ = బొట్లుతో; బంధుర = నిండిన; చారు = అందమైన; కపోల = చెక్కిళ్ళు; గద్గద = బొంగురుపోయిన; స్వర = గొంతు; పులకీకృత = పులకరములు పొందిన; అంగులు = దేహములు; అగువారలు = కలవారు; నిస్పృహ = కోరికలు లేని; చిత్తులు = మనసులు కలవారు; అతి = మిక్కిలి; అహంకరణ = అహంకారమునకు; విదూరులు = మిక్కిలి దూరముగ ఉండువారు; ఉందురు = ఉండెదరు; సుకర్ములు = పుణ్యాత్ములు {సుకర్ములు - మంచి పనులు చేయువారు, పుణ్యాత్ములు}; ఉండెడి = ఉండునట్టి; పుణ్య = పవిత్రమైన; భూములన్ = ప్రదేశములందు.

భావము:

పద్మనాభుడైన విష్ణువు యొక్క దివ్యమంగళ కథలను ఆలపించడం వల్ల పెల్లుబికిన ఆనందబాష్ప ధారలతో చెమ్మగిలుటవలన అందగించిన చెక్కిళ్ళూ గద్గదమైన కంఠమూ పులకరించిన మేనులూ కలవాళ్ళూ, వైరాగ్యభావం కల మనస్సు కలవాళ్ళూ, అహంకారాన్ని పూర్తిగా విడిచినవాళ్ళూ; సజ్జనులుండే ఆ వైకుంఠ పుణ్యప్రదేశంలో ఉంటారు.