పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల వైకుంఠ గమనంబు

  •  
  •  
  •  

3-508-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రివిముఖాత్ము లన్యవిషయాదృత చిత్తులుఁ బాపకర్ములున్
నియనిపాత హేతువును నింద్యచరిత్రము నైన దుష్కథా
నితిఁ జరించువారలును నేరరు పొందఁగ నిందిరామనో
చరణారవింద భజనాత్మకు లుండెడు గొంది నారయన్.

టీకా:

హరి = విష్ణుని; విముఖ = వ్యతిరేక; ఆత్ములు = భావములు కలవారు; అన్య = ఇతరములైన; విషయ = ఇంద్రియార్థ విషయములందు; ఆదృత = లగ్నమైన; చిత్తులు = మనసు కలవారు; పాప = పాపపు; కర్ములు = పనులుచేయువారు; నిరయ = నరకమున; నిపాత = పడిపోవుటకు; హేతువునున్ = కారణములును; నింద్య = నిందింప తగు; చరిత్రమున్ = వర్తనలు కలదియును; ఐన = అయినట్టి; దుః = చెడ్డ; కథా = కథల యందు; నిరతిన్ = లాలసతో; చరించు = తిరుగుతున్న; వారలునున్ = వారును; నేరరు = శక్యము కాదు; పొందగన్ = పొందుటకు; ఇందిరామనోహర = విష్ణుని {ఇందిరా మనోహరుడు - ఇందిర (లక్ష్మీదేవి) మనోహరుడు (భర్త), విష్ణువు}; చరణా = పాదములు అనెడి; అరవింద = పద్మములను; భజన = సేవించు; ఆత్మకులు = స్వభావము కలవారు; ఉండెడు = ఉండునట్టి; గొందిన్ = వీథిని {గొంది - (పాపులు చొరబడుటకు వీలుకాని) సందు, వీథి}; అరయన్ = తరచిచూసిన.

భావము:

విష్ణువునకు విముఖులైనవాళ్ళూ, ఇతర లౌకిక సుఖాలతో సతమతమయ్యే మనస్సు కలవాళ్ళూ, పాపపు నడవడి కలవాళ్ళూ, నరకానికి కారణాలై దూషింపదగిన చెడ్డ కథలందు ఆసక్తి కలిగి మెలిగేవాళ్ళూ భగవంతుని పాదపద్మాలను సేవించే భక్తులుండే ఆ పవిత్ర ప్రదేశాన్ని చేరుకోలేరు.