పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల వైకుంఠ గమనంబు

  •  
  •  
  •  

3-502-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గీర్వాణులార! యుష్మ
త్పూర్వజు లాత్మీయసుతులు పుణ్యులు విచర
న్నిర్వాణులు సనకాదులు
ర్వంకషశేముషీవిక్షణు లెందున్.

టీకా:

గీర్వాణులార = దేవతలార; యుష్మత్ = మీ కంటే; పూర్వ = ముందుగ; జులు = పుట్టినవారు; ఆత్మీయ = నా యొక్క; సుతులు = పుత్రులు; పుణ్యులు = పుణ్యవంతులు; విచరత్ = నడుస్తున్న; నిర్వాణులు = మోక్షస్వరూపులు; సనకాదులు = సనకాదులు {సనకాదులు - సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వీరు దేవసర్గమునకు చెంది దేవమానవ ఉభయలక్షణములు కలవారు}; సర్వన్ = సమస్తమును; కష = వ్యాపించిన; శేముషీ = బుద్ధి; విచక్షణులు = వివేకములు కలవారు; ఎందున్ = అన్నిలోకములలోను.

భావము:

“ఓ దేవతలారా! సనక సనందనులు మొదలైనవారు మీకు పూర్వులు. నా మానసపుత్రులు. పుణ్యాత్ములు. నడచివచ్చే మోక్షస్వరూపులు. సర్వ విషయాలలో సమగ్రమైన బుద్ధి, వివేకం కలవారు.

3-503-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాలు నిస్పృహు లగుచు న
వాణ భువనంబు లెల్ల డిఁ గ్రుమ్మరుచున్
ధీరు లొకనాఁడు భక్తిన్
శ్రీమణీశ్వరపదాబ్జసేవానిరతిన్.

టీకా:

వారలు = వారు; నిస్పృహులు = కోరికలు లేనివారు; అగుచున్ = అయ్యి; అవారణన్ = అడ్డుపెట్టువారు లేక; భువనంబులు = లోకములు; ఎల్లన్ = అన్నియును; వడిన్ = వేగముగ; కృమ్మరుచున్ = తిరుగుతూ; ధీరులు = ధీమంతులు; ఒక = ఒక; నాడు = రోజున; భక్తిన్ = భక్తితో; శ్రీరమణీశ్వర = విష్ణుని {శ్రీ రమ ణీశ్వరుడు - శ్రీ (లక్ష్మీ) రమణి (దేవి) యొక్క ఈశ్వరుడు (భర్త), విష్ణువు}; పద = పాదములు అనెడి; అబ్జ = పద్మముల {అంబుజ - అంబు (నీట) జ పుట్టినది, పద్మము}; సేవా = సేవించవలెనను; నిరతిన్ = మిక్కిలి ఆసక్తితో.

భావము:

ధీరులూ, కోరికలు లేనివారూ అయిన ఆ సనక సనందనాదులు యథేచ్ఛగా లోకాలన్నీ తిరుగుతూ ఒకనాడు విష్ణు పాదపద్మాలను సేవించాలనే కోరికతో బయలుదేరారు.

3-504-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిచని కాంచిరంత బుధత్తము లంచిత నిత్య దివ్యశో
విభవాభిరామముఁ బ్రన్నజనస్తవనీయ నామమున్
న విరామమున్ సుజన న్నుత భూమము భక్తలోకపా
గుణధామముం బురలలామముఁ జారువికుంఠధామమున్.

టీకా:

చనిచని = బయలుదేరి వెళ్లి; కాంచిరి = దర్శించిరి; అంతన్ = అంతట; బుధ = జ్ఞానులలో; సత్తములు = శ్రేష్ఠులు; అంచిత = పూజనీయమును; నిత్య = శాశ్వతమును; దివ్య = దివ్యమును; శోభన = ప్రకాశించుచున్నదియు నైన; విభవ = వైభవముతో; అభిరామమున్ = ఒప్పుతున్నదియును; ప్రపన్న = శరాణాగతులకు; స్తవనీయ = స్తుతింపదగిన; నామమున్ = పేరు కలదియును; జనన = జన్మబంధముల; విరామమున్ = ఛేదించునదియును; సు = మంచి; జన = జనులచే; సన్నుతన్ = స్తుతింపబడిన; భూమము = స్థానమును; భక్త = భక్తులు; లోక = అందరను; పాలన = పరిపాలించు; గుణ = గుణములు కల; ధామమున్ = ప్రదేశమును; పుర = నగరములలో; లలామమున్ = శ్రేష్ఠభూషణమైనదియును అయిన; చారు = అందమైన; వికుంఠ = వైకుంఠ; ధామమున్ = పురమును;

భావము:

జ్ఞానులలో శ్రేష్ఠులైన ఆ సనక సనందనాదులు అలా వెళ్ళి వెళ్ళి శ్రేష్ఠమైన వైకుంఠ నగరాన్ని చూసారు. అది దివ్యమైన శోభతో నిత్యమూ దేదీప్యమానంగా మనోహరంగా ఉంటుంది. శరణుకోరే భక్తులు దాని పేరును స్తుతిస్తారు. అది జన్మబంధాలను ఛేదిస్తుంది; సజ్జనులచేత పొగడ బడుతుంది; భక్త జనులను పాలించే గుణాలకు ఆలవాలమైనట్టిది.

3-505-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హనీయ పట్టణము నందు వసించెడు వార లాత్మఁ ని
ష్కాఫలంబె సత్ఫలముగాఁ దలపోసి ముముక్షుధర్ము లై
శ్రీహిళాధిపాంఘ్రిసరసీరుహ పూజ లొనర్చుచున్ మహో
ద్ధామఁ దదీయ రూపములఁ దాల్చి సుఖించుచు నుందు రెప్పుడున్.

టీకా:

ఆ = ఆ; మహనీయ = గొప్ప; పట్టణము = నగరము; అందున్ = లో; వసించెడు = నివసించుచున్న; వారలు = వారు; ఆత్మ = తమ మనసులో; నిష్కామ = కోరికలు లేని/పోవు స్థితి యను; ఫలంబె = ఫలితమునే; సత్ఫలమున్ = సత్ఫలితము; కాన్ = అని; తలపోసి = అనుకొని; ముముక్షు = ముక్తి కోరెడి అను; ధర్ములు = ధర్మము కలవారు; ఐ = అయ్యి; శ్రీమహిళాధిప = విష్ణుని {శ్రీ మహి ళాధిపుడు - శ్రీ (లక్ష్మీ) మహిళ (దేవి) యొక్క అధిపుడు (భర్త), విష్ణువు}; అంఘ్రి = పాదములు అనెడి; సరసీరుహన్ = పద్మములకు {సరసీరుహములు - సరసు అందు పుట్టునవి, పద్మములు}; పూజలున్ = పూజలు; ఒనర్చుచున్ = చేస్తూ; మహ = మిక్కిలి; ఉద్దామ = ఉత్తమమైన; తదీయ = అతని; రూపములన్ = రూపములను; ధరించి = తాల్చి; సుఖించుచున్ = సుఖమును పొందుతూ; ఉందురు = ఉంటారు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును.

భావము:

ఆ వైకుంఠ మహానగరంలో నివసించేవారు నిష్కామ ఫలమే తమకు సత్ఫలంగా భావిస్తూ, కైవల్యధర్మం కలవారై, విష్ణు పాదపద్మాలను పూజిస్తూ, అపురూపాలైన విష్ణు స్వరూపాలను ధరించి ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు.

3-506-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వితరజస్తమోగుణుఁడు విశ్రుతచారుయశుండు శుద్ధస
త్త్వగుణుఁ డజుం డనాదిభగవంతుఁ డనంతుఁ డనంతశక్తియున్
నిమచయాంతవేద్యుఁడు వినిశ్చల నిర్మల ధర్మమూర్తియు
న్నగు హరిపేరఁ బెంపెసఁగు న్నగరోపవనమ్ము లిమ్ములన్.

టీకా:

విగతరజస్తమోగుణుఁడు = విష్ణుమూర్తి {విగత రజస్తమో గుణుడు - వదలిన రజోగుణమును తమోగుణములు గుణములు కలవాడు}; విశ్రుతచారుయశుండు = విష్ణుమూర్తి {విశ్రుత చారు యశుడు - ప్రసిద్ధికెక్కిన చక్కని కీర్తి కలవాడును}; శుద్ధసత్త్త్వగుణుండు = విష్ణుమూర్తి {శుద్ధ సత్త్త్వ గుణుడు - పరిశుద్ధమైన సత్త్త్వగుణము కలవాడును, విష్ణువు}; అజుండున్ = విష్ణుమూర్తి {అజుడు - జన్మములు లేనివాడు, విష్ణువు}; అనాదిభగవంతుడున్ = విష్ణుమూర్తి {అనాది భగవంతుడు - అనాది (మొట్టమొదటినుండి) ఉన్న భగవంతుడు (మహిమాన్వితుడు), విష్ణువు}; అనంతుడు = విష్ణుమూర్తి {అనంతుడు – అంతము లేనివాడు, విష్ణువు}; అనంతశక్తియున్ = విష్ణుమూర్తి {అనంతశక్తి - అంతులేని శక్తి కలవాడు, విష్ణువు}; నిగమచయాంతవేద్యుడున్ = విష్ణుమూర్తి {నిగమచ యాంత వేద్యుడు - నిగమ (వేద) చయ (సముదాయముల) అంత (సర్వస్వము వలన) వేద్యుడు (తెలియబడువాడు), (వేదాంతవేద్యుడు), విష్ణువు}; వినిశ్చలనిర్మలధర్మమూర్తియున్ = విష్ణుమూర్తి యును {వినిశ్చల నిర్మల ధర్మమూర్తి - వినిశ్చల (మిక్కిలి చాంచల్యరహితమైన) నిర్మల (కల్మషరహితమైన) ధర్మమూర్తి (ధర్మము యొక్క స్వరూపము అయినవాడు), విష్ణువు}; అగు = అయినట్టి; హరి = విష్ణుమూర్తి; పేరన్ = పేరుమీద; పెంపెసగున్ = అతిశయించుచున్న; ఆ = ఆ; నగర = పట్టణము యొక్క; ఉపవనములన్ = ఉద్యానవనముల యందు; ఇమ్ములన్ = విలసిల్లుతున్నది.

భావము:

రజస్తమోగుణాలకు అతీతుడూ, చక్కని కీర్తి కలవాడూ, స్వచ్ఛమైన సత్త్వగుణం కలవాడూ, జన్మరహితుడూ, ఆద్యంతాలు లేని భగవంతుడూ, అనంతశక్తిశాలీ, వేదాంతవేద్యుడూ, నిశ్చలం నిర్మలం అయిన ధర్మం మూర్తీభవించినవాడూ అయిన విష్ణుమూర్తి పేరుతో ఆ నగరంలోని ఉద్యానవనం పెంపొందుతున్నది.

3-507-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ గైవల్యంబు మూర్తీభవించిన తెఱంగునం బొలుపారుచు "నైశ్శ్రేయస" నామంబున నభిరామంబై సతతంబును సకలర్తుధర్మంబులు గలిగి యర్థిజనంబుల మనంబుల ఘనంబులుగ నీరికలెత్తిన కోరికలు సారికలుగొన నొసంగుచు నితరతరు రహితంబులును గామదోహన సహితంబులును బుష్పఫల భరితంబులును నై తనర్చు సంతాన వనసంతానంబులును, సమంచిత సౌభాగ్య సంపదభిశోభిత వాసంతికా కుసుమ విసర పరిమళ మిళిత గళిత మకరంద లలితామోద ముదిత హృదయు లై యఖండ తేజోనిధి యగు పుండరీకాక్షు చరిత్రంబు లుగ్గడింపలేక ఖండితజ్ఞాను లయ్యును నిరతిశయ విషయసుఖానుభవ కారణం బగుట నిందిరాసుందరీరమణ చరణసేవా విరమణకారియై యున్న దని తలంచి; తద్గంధ ప్రాపక గంధవహునిం దిరస్కరించి నారాయణ భజనపరాయణు లై చరియించు సుందరీ యుక్తు లైన వైమానికులును, వైమానిక మానసోత్సేకంబుగం బారావత హంస సారస శుక పిక చాతక తిత్తిరి మయూర రథాంగముఖ్య విహంగ కోలాహల విరామంబుగా నరవిందనయన కథాగానంబు లనూనంబుగా మొరయ మదవదిందిందిర సందోహ కలిత పుష్పవల్లీమతల్లికలును, నకుంఠిత చరిత్రుం డైన వికుంఠనిలయుని కంఠంబునం దేజరిల్లు విలసిత తులసీ దామంబుం గనుంగొని యీ తులసీదామంబు హరి మంగళగళ విలగ్నంబై యుండు సౌభాగ్యంబు వడయుట కేమి తపంబు గావించెనో యని బహూకరించు చందంబున నొప్పు చందన మందార కుందారవింద పున్నాగ నాగ వకుళాశోక కురవకోత్పల పారిజాతాది ప్రసూన మంజరులును, మంజరీ పుంజ రంజిత నికుంజంబుల యందు నుత్తుంగ పీనకుచభారాకంపిత మధ్యంబులుఁ గటితట కనకఘటిత మేఖలాకలాప నినదోపలాలిత నీల దుకూల శోభిత పృథు నితంబ భరాలసయాన హసిత కలహంస మయూర గమనంబులు నసమశర కుసుమశర విలసితంబు నపహసించు నయనకమలంబులుం గలిగిన సుందరీ సందోహంబులం దగిలి కందర్పకేళీ విహారంబుల నానందంబు నొందక ముకుంద చరణారవింద సేవాపరిలబ్ధ మరకత వైడూర్య హేమమయ విమానారూఢు లై హరిదాసులు విహరించు పుణ్యప్రదేశంబులును, నిందిరాసుందరి త్రైలోక్య సౌందర్యఖని యైన మనోహరమూర్తి ధరియించి రమణీయ రణిత మణినూపుర చరణారవింద యై నిజహృదయేశ్వరుం డైన సర్వేశ్వరుని మందిరంబునం జాంచల్య దోషరాహిత్యంబుగ వర్తింపం గరకమల భ్రమణీకృత లీలాంబుజాత యై తన నీడ కాంచనస్ఫటికమయ కుడ్యప్రదేశంబులం బ్రతిఫలింప శ్రీనికేతనుని నికేతన సమ్మార్జన కైంకర్యంబ పరమధర్మం బని తెలుపు చందంబునం జూపట్టుచు నిజవనంబునం దనరు సౌరభాభిరామంబు లగు తులసీదళదామంబుల నాత్మనాయకుని చరణారవిందంబుల నర్పించుచు నొసలి మృగమదపు టసలున మసలుకొని తుంపెసలాడు కురులును, లలిత తిలప్రసూన రుచిరాభ నానం దనరు మోముఁదామర విమల సలిలంబులఁ బ్రతిబింబింప నిజమనోనాయకుచేతం జుంబితం బగుటగాఁ దలంచి లజ్జావనతవదన యై యుండంజేయు ప్రవాళ లతికాకులంబు లైన కూలంబులు గల నడబావులును గలిగి పుణ్యంబునకు శరణ్యంబును, ధర్మంబునకు నిర్మలస్థానంబును, సుకృతమూలంబునకు నాలవాలంబును నయి పొలుపొందుచుండు.

టీకా:

మఱియున్ = ఇంకనూ; కైవల్యంబున్ = కైవల్యము {కైవల్యము - కేవలము తానైన స్థితి, ముక్తి}; మూర్తీభవించిన = స్వరూపమును ధరించిన; తెఱంగునన్ = విధముగా; పొలుపారుచున్ = విరాజిల్లుతూ; నైశ్రేయస = నిశ్రేయస్సు అను {నైశ్రేయస్సు - నిశ్రేయస్సు (మిక్కిలి శ్రేయస్సు, ముక్తి) ను కలిగించునది}; నామంబునన్ = పేరుతో; అభిరామంబున్ = సుందరమైనది; ఐ = అయ్యి; సతతంబున్ = ఎల్లప్పుడును; సకల = సమస్తమైన; ఋతు = ఋతువుల యొక్క; ధర్మంబులున్ = లక్షణములును; కలిగి = కలిగి ఉండి; అర్థి = కోరు; జనంబులన్ = జనుల యొక్క; మనంబులన్ = మనసులను; ఘనంబులుగన్ = బహుమిక్కిలి యైన; ఈరికలున్ = మొలకెత్తిన; కోరికలున్ = కోరికలు; సారికలుగొన = చిందులు త్రొక్కుటలు(కోరికలు రేకెత్తించుటలు); ఒసంగుచున్ = అందజేయుచూ; ఇతర = అన్య; తరు = వృక్షములు, రహితంబులునున్ = లేనివియును; కామ = కోరికలను; దోహన = పితుకుటను; సహితంబులునున్ = కలిగినవి యైన; పుష్ప = పువ్వులు తోను; ఫల = పళ్లు తోను; భరితంబులున్ = నిండినవి; ఐ = అయ్యి; తనర్చు = అతియించుచున్న, తరింపజేయుచున్న; సంతాన = కల్పవృక్ష; వన = తోటల; సంతానంబులునున్ = సమూహములును; సమంచిత = చక్కటి; సౌభాగ్య = సౌభాగ్యమును; సంపద = సంపదలతోను; అభి = మిక్కిలి; శోభిత = ప్రకాశించుచున్న; వాసంతికా = అడవిమొల్ల, గురివింద; కుసుమ = పూల; విసర = సమూహముల; పరిమళ = సుగంధము; మిళిత = కలిసి; గళిత = స్రవిస్తున్న; మకరంద = మకరందమును; లలిత = మనోజ్ఞముగ; ఆమోద = ఆశ్వాదించుటచే; ముదిత = ఆనందిత; హృదయులు = హృదయములు కలవారు; ఐ = అయ్యి; అఖండ = నిరంతర; తేజస్ = ప్రకాశమునకు; నిధి = సముద్రము వంటిది; అగు = అయినట్టి; పుండరీకాక్షు = విష్ణుని {పండరీకాక్షుడు - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణుమూర్తి}; చరిత్రంబులున్ = కథలు; ఉగ్గడింపన్ = పూర్తిగా చెప్ప; లేక = లేక; ఖండిత = అసంపూర్ణ; జ్ఞానులు = జ్ఞానములు కలవారు; అయ్యును = అయినప్పటికిని; నిరతిశయ = సాటిలేని; విషయ = ఇంద్రియార్థ విషయము లందలి; సుఖ = సుఖమును; అనుభవ = అనుభవించుట అను; కారణంబున్ = కారణములు; అగుటన్ = జరుగుటవలన; ఇందిరాసుందరీరమణ = విష్ణుని {ఇందిరా సుందరీ రమణుడు - ఇందిరా (లక్ష్మీ) సుందరీ (దేవియొక్క) రమణుడు (భర్త), విష్ణుమూర్తి}; చరణ = పాదములు; సేవా = సేవించుకొనుట యందు; విరమణ = విరామమును; కారి = కలిగించునది; ఐ = అయ్యి; ఉన్నదని = ఉందని; తలంచి = అనుకొని; తత్ = ఆ; గంధ = వాసనలను; ప్రాపక = వ్యాపింప జేయు; గంధవాహనిన్ = వాయువును; తిరస్కరించి = తిరస్కరించి; నారాయణ = విష్ణుని {నారాయణుడు - నారములు (నీటి)లో ఉండువాడు, విష్ణుమూర్తి}; భజన = సేవించుట యందు; పరాయణులు = నిష్ఠ కలవారు; ఐ = అయ్యి; చరియించు = వర్తించు; సుందరీ = అందమైన స్త్రీలతో; యుక్తులు = కలిసి ఉన్నవారు; ఐన = అయినట్టి; వైమానికులును = విమానముల పై తిరుగువారు; వైమానిక = వైమానికుల; మానస = మనసులలో; ఉత్సేకంబుగన్ = ఉత్సాహము కలిగించునట్టి; పారావత = పావురములు; హంస = హంసలు; సారస = బెగ్గరు పక్షులు; శుక = చిలుకలు; పిక = కోకిలలు; చాతక = చాతక పక్షులు; తిత్తిరి = తీతువు పిట్టలు; మయూర = నెమళ్ళు; రథాంగ = చక్రవాకములు; ముఖ్య = మొదలగు; విహంగ = పక్షుల; కోలాహల = కోలాహలముతో; విరామంబుగాన్ = విరాజిల్లుతుండగా; అరవిందనయన = విష్ణుని {అరవింద నయనుడు - అరవింద (పద్మము)ల వంటి నయనములు కలవాడు, విష్ణువు}; కథా = కథలు; గానంబులు = పాటలు; అనూనంబుగాన్ = నిండుగా; మొరయు = మారు మోగుతున్నదియును; మదవ = మదించిన; ఇందిందిర = తుమ్మెదల; సందోహ = సమూహములతో; కలిత = కూడిన; పుష్ప = పూల; వల్లీమత్ = తీగలతో చక్కగా; అల్లికలును = అల్లికలును; అకుంఠిత = సాటిలేని; చరిత్రుండు = వర్తనములు కలవాడు; ఐన = అయినట్టి; వికుంఠ = వైకుంఠమున; నిలయుని = నివసించువాని; కంఠంబునన్ = మెడలో; తేజరిల్లు = ప్రకాశించు; విలసిత = విలాసవంతమైన; తులసీ = తులసీ; దామంబున్ = మాలను; కనుంగొని = చూసి; ఈ = ఈ; తులసీ = తులసీ; దామంబున్ = మాల; హరి = విష్ణుని; మంగళ = శుభకరమైన; గళ = మెడలో; విలగ్నంబున్ = చక్కగా వేయబడినది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండునట్టి; సౌభాగ్యంబున్ = సౌభాగ్యమును; పడయుట = పొందుట; కిన్ = కి; ఏమి = ఏవిధమైన; తపంబున్ = తపస్సును; కావించెనో = చేసినదో; అని = అని; బహూకరించు = గౌరవించు; చందంబునన్ = విధముగా; ఒప్పు = ఒప్పి ఉన్న; చందన = కుంకుమ పువ్వులు; మందార = మందారములు; కుంద = మల్లెలు; అరవింద = తమ్మిపూలు, పద్మములు; పున్నాగ = పన్నాగ పూలు; నాగ = పొన్నపూలు; వకుళ = పగడపూలు; అశోక = అశోకములు; కురవక = గురివిందపూలు; ఉత్పల = కలువపూలు; పారిజాత = పారిజాతములు; ఆది = మొదలగు; ప్రసూన = పువ్వుల; మంజరులును = గుత్తులును; మంజరీ = పూలగుత్తుల; పుంజ = సమూహములతో; రంజిత = ముచ్చటైన; నికుంజంబుల్ = పొదరిళ్ల; అందున్ = లో; ఉత్తుంగ = ఎత్తైన; పీన = పెద్ద; కుచ = స్తనముల యొక్క; భార = బరువుచేత; కంపిత = ఊగుతున్న; మధ్యంబులున్ = నడుములును; కటి = మొల; తటి = ప్రదేశమున; కనక = బంగారముచే; ఘటిత = చేయబడిన; మేఖలా = వడ్డాణములు; కలాప = చేయుచున్న; నినద = చక్కటి శబ్దములచే; ఉపలాలిత = బుజ్జగింపబడుతున్న; నీల = నీలిరంగు; దుకూల = పట్టువస్త్రములచే; శోభిత = శోభాయమానమైన; పృథు = పెద్ద; నితంబ = పిరుదుల; భర = బరువుచేత; అలస = మెల్లిగా; యాన = ఊగుతూ; హసిత = వేళాకోళము చేయబడుతున్న; కలహంస = కలహంస {కలహంస - కలకాలరావము చేయు హంసలు}; మయూర = నెమళ్ల; గమనంబులున్ = నడకలునూ; అసమశర = మన్మథుని {అసమశరుడు - సరిసంఖ్య గాక బేసి సంఖ్యలో (పంచ) శరములు (బాణములు) కలవాడు, పంచశరుడు, మన్మథుడు}; కుసుమ = పూల; శర = బాణములను; విలసితంబున్ = విలాసమును; అపహసించు = అపహాస్యము చేయజాలు; నయన = కన్నులు అను; కమలంబులున్ = పద్మములును; కలిగిన = కలిగినట్టి; సుందరీ = సుందరీమణుల; సందోహంబులన్ = సమూహము లందు; తగిలి = లగ్నమై; కందర్ప = మన్మథ; కేళీ = కేళి యందు; విహారంబులన్ = విహరించుటలో; ఆనందంబున్ = ఆనందమును; ఒందక = పొందకుండా; ముకుంద = విష్ణుని; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; పరిలబ్ధ = చక్కగాలభించిన; మరకత = పచ్చలు; వైడూర్య = వైడూర్యములు; హేమ = బంగారములు; మయ = తాపడము చేయబడిన; విమాన = విమానములను; ఆరూఢులు = అధిరోహించినవారు; ఐ = అయ్యి; హరి = విష్ణుని; దాసులున్ = భక్తులు; విహరించు = తిరుగుతున్న; పుణ్య = పుణ్యవంతమైన; ప్రదేశంబులును = ప్రదేశములును; ఇందిరాసుందరి = లక్ష్మీదేవి; త్రై = మూడు; లోక్య = లోకము లందలి; సౌందర్య = అందములకు; ఖని = నిధి వంటిది; ఐన = అయినట్టి; మనోహర = మనోహరమైన; మూర్తిన్ = స్వరూపమును; ధరియించి = స్వీకరించి; రమణీయ = అందమైన; రణిత = శబ్దము చేయుచున్న; మణి = మణిమయ; నూపుర = అందెలు ధరించిన; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మములు కలామె; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; హృదయేశ్వరుండు = భర్త {హృద యేశ్వరుడు – మనసు నందు అధికారము కలవాడు, భర్త}; ఐన = అయిన; సర్వేశ్వరుని = విష్ణుని {సర్వేశ్వరుడు - సర్వులకు (అందరకును) ఈశ్వరుడు (ఫ్రభువు), విష్ణుమూర్తి}; మందిరంబునన్ = భవనములో; చాంచల్య = చంచలత్వము అను; దోష = దోషము; రాహిత్యంబుగన్ = లేకుండగా; వర్తింపన్ = ప్రవర్తిస్తుండగా; కర = చేయి అనెడి; కమల = కమలము అందు; భ్రమణీ = తిప్పుట; కృత = చేయబడుతున్న; లీలా = లీలార్థమైన; అంబుజాత = పద్మము కలామె {అంబుజాతము - అంబువులు (నీటి) అందు పుట్టినది, పద్మము}; ఐ = అయ్యి; తన = తన యొక్క; నీడ = నీడ; కాంచన = బంగారము; స్ఫటిక = స్ఫటికములు; మయ = తాపిన; కుడ్య = గోడల; ప్రదేశంబులన్ = తలముపై; ప్రతిఫలింపన్ = ప్రతిఫలిస్తుండగా; శ్రీనికేతనుని = విష్ణుని {శ్రీ నికేతనునుడు - శ్రీ (సిరికి, లక్ష్మీదేవికి) నికేతనుడు (నివాసమైనవాడు), విష్ణువు}; నికేతన = నివాసమును; సమ్మార్జన = తుడుచుట అను; కైంకర్యంబ = సేవయే {కైంకర్యము - కై (స్వంత చేతుల)తో కర్యము (చేయు) ఊడిగము, సేవ}; పరమ = అత్యుత్తమమైన; ధర్మంబున్ = చేయతగ్గ పని; అని = అని; తెలుపు = తెలియజేయు; చందంబునన్ = విధముగా; చూపట్టుచూ = కనబడుతున్న; నిజ = అతని; వనంబునన్ = ఉద్యానవనములో; తనరు = ఒప్పుతున్న; సౌరభ = సువాసనలతో; అభిరామంబుల్ = మనోజ్ఞములు; అగు = అయినట్టి; తులసీ = తులసీ; దళ = దళముల; దామంబులన్ = మాలలతో; ఆత్మ = తమ; నాయకునిన్ = నాయకుడి; చరణ = పాదములు అనెడి; అరవిందంబులన్ = పద్మములకు; అర్పించుచున్ = సమర్పిస్తూ; నొసలి = నొసటి; మృగమదపు = కస్తూరి {మృగమదము - కస్తూరి మృగము నుండి తీయబడు ఒక సుగంధద్రవ్యము, కస్తూరి}; టసలునన్ = తిలకము (బొట్టు)నందు; మసలుకొని = అంటుకొని; తుంపెసలు = తూగుతున్న; కురులును = వెంట్రుకలును; లలిత = అందమైన; తిల = నువ్వు; ప్రసూన = పూల; రుచిర = చక్కదనముతో; అభ = మెరుస్తున్న; నాసన్ = ముక్కుతో; తనరు = అతిశయించు; మోమున్ = ముఖమును; తామర = తామరపూలు కల; విమల = నిర్మలమైన; సలిలంబులన్ = నీటిలో; ప్రతిబింబింపన్ = ప్రతిఫలించగా; నిజ = తన యొక్క; మనోనాయకు = భర్త; చేతన్ = చేత; చుంబితంబు = ముద్దుపెట్టుకొన్నది; అగుటగాన్ = అయినట్లు; తలంచి = అనుకొని; లజ్జా = సిగ్గుతో; అవనత = వంచిన; వదన = మోముకలామె; ఐ = అయ్యి; ఉండన్ = ఉండునట్లు; చేయు = చేయగల; ప్రవాళ = పగడపు; లతికా = హారముల; కులంబులు = సమూహములు; ఐన = ఉన్నట్టి; కూలంబులు = గట్టులు; కల = కలిగినట్టి; నడబావులు = దిగుడు బావులును; కలిగి = ఉన్నట్టి; పుణ్యంబున్ = పుణ్యమున; కున్ = కు; శరణ్యంబునున్ = రక్షకములును; ధర్మంబున్ = ధర్మమున; కున్ = కు; నిర్మల = విమలమైన; స్థానంబునున్ = నివాసమును; సుకృత = పుణ్యములు అను; మూలంబున్ = చెట్టు మొదళ్ళ; కున్ = కు; ఆలవాలంబునున్ = పాదు వంటిదియును; అయి = అయ్యి; పొలుపొందుచున్ = ఒప్పారుతూ; ఉండున్ = ఉండును.

భావము:

మోక్షమే మూర్తీభవించిందా అన్నట్లున్న ఆ ఉద్యానవనం ‘నైశ్శ్రేయసం’ అనే పేరుతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ వనంనిండా ఎన్నెన్నో కల్పవృక్షాలు స్వేచ్ఛగా పెరిగి పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. అవి అన్ని వేళలా అన్ని ఋతువుల వైభవంతో శోభిస్తూ, అర్థిజనుల మనస్సులలో మొలకెత్తిన కోరికలను కొరత లేకుండా తీరుస్తుంటాయి.
కొల్లలుగా విరబూచిన మొల్లపూవుల సుగంధంతో కూడిన మకరంద బిందువులను మందమారుతాలు అక్కడ నలుమూలలా వెదజల్లుతూ ఉంటాయి. తమ సుందరీమణులతో విమానాలలో విహరించే గంధర్వులు ఆ కమ్మని పూలతేనెల సోనలను ఆస్వాదిస్తూ మైమరచి మహానుభావుడైన విష్ణుదేవుని కథలు చెప్పుకొనడం మరిచిపోతూ ఉంటారు. అంతలోనే వారు ఆ అజ్ఞానంనుండి తేరుకొని విచ్చలవిడిగా విషయవాసనలను రెచ్చగొట్టే ఆ సువాసనలు నారాయణుని పాదపద్మాల సేవకు ఆటంకాలని భావించి ఆ సువాసనలను తృణీకరించి విష్ణుసేవాపరాయణులై సంచరిస్తూ ఉంటారు. పావురాలూ, హంసలూ, బెగ్గురు పక్షులూ, చిలుకలూ, కోకిలలూ, వానకోయిలలూ, తీతువుపిట్టలూ, నెమళ్ళూ, చక్రవాకాలూ మొదలైన పక్షులు వారి మనస్సులలో ఆనందం పొంగిపొరలేటట్లు చేస్తూ ఉంటాయి. ఆ కోలాహలాన్ని మించి విష్ణుకథలను నిరంతరం గానం చేస్తున్నట్లు ఝంకారం చేస్తున్న గండుతుమ్మెదలతో కూడిన మేలుజాతి పూలతీగలు కనువిందు చేస్తుంటాయి.
వందనీయ చరిత్రుడైన వైకుంఠనిలయుని కంఠంలో వనమాలికలుగా వెలసి విలసిల్లడానికి ఈ తులసి ఎంతటి తపస్సు చేసిందో అని ఆనందంతో అభినందిస్తున్నట్లు మంచి గంధపుచెట్లు, మందారాలు, మల్లెలు, కమలాలు, సురపొన్నలు, పొన్నలు, పొగడలు, అశోకాలు, గోరంటలు, కలువలు, పారిజాతాలు గుత్తులు గుత్తులుగా పూచి తులసీవనాలపై సుగంధాలు విరజిమ్ముతూ ఉంటాయి.
అక్కడ ఒత్తుగా పూచిన పూలగుత్తులతో గుబాళించే పొదరిండ్లున్నాయి. ఆ పొదరిండ్లలో ఎత్తైన స్తనకుంభాల బరువుకు నకనకలాడే సన్నని నడుములు కల కొందరు సుందరీమణులు విహరిస్తుంటారు. ఆ లతాంగులు నీలిరంగు పట్టుచీరలు కట్టుకొని, బంగారు గజ్జెల ఒడ్డాణాలు సింగారించుకొని ఉంటారు. వారి వయ్యారపు నడకల సొగసులు హంసలనూ, నెమళ్ళనూ ఎగతాళి చేస్తున్నట్లుంటాయి. వారి వాలుకన్నులు మన్మథుని పూలబాణాలను పరిహసిస్తుంటాయి. వారి సౌందర్యానికి లొంగక, వారితో శృంగారక్రీడలను కోరుకోకుండా, అక్కడి విష్ణుభక్తులు గోవిందుని చరణారవిందాలను సేవించడం వల్ల లభించిన నవరత్నాలు పొదిగిన బంగారు విమానాలను ఎక్కి అక్కడి పుణ్యప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు.
అందాలదేవి అయిన లక్ష్మీదేవి ముల్లోకాల సౌందర్యం మూర్తీభవించినట్లుగా మణులు చెక్కిన కాలి అందెలు ఘల్లుఘల్లున మ్రోగుతుండగా తన మనోనాథుడయిన వైకుంఠనాథుని మందిరంలో తన చంచలత్వాన్ని మాని సంచరిస్తూ ఉంటుంది. ఆమె తన చేతిలోని లీలాకమలాన్ని త్రిప్పుతూ ఉండగా ఆమె నీడ ఆ మేడలోని బంగారు పాలరాతి గోడలపై ప్రతిఫలిస్తుంది. అప్పుడది విష్ణుమందిర సమ్మార్జనమే పరమధర్మమని ప్రకటిస్తున్న ట్లుంటుంది. వనంలోని పరిమళాలను వెదజల్లే తులసీదళాలను దండలు కట్టి లక్ష్మీదేవి తన హృదయేశ్వరుని పదకమలాలపై అర్పిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రమవల్ల కలిగిన స్వేద బిందువులవల్ల నుదుటనున్న కస్తూరీ తిలకం కరిగి అంటుకొని కదలుతున్న ముంగురులతో, నువ్వుపువ్వువంటి చక్కదనాల ముక్కుతో ముద్దులు మూటగట్టే ఆమె ముఖపద్మం అక్కడి కోనేటినీటిలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఆమె నీల మేఘశ్యాముడైన విష్ణువు తన ముఖాన్ని ముద్దాడుతున్నట్లు భ్రమించి సిగ్గుతో తల వంచుకొంటుంది. అటువంటి దిగుడు బావుల చుట్టూ గట్టులపైన పగడాలతీగలు అల్లుకొని ఉంటాయి. ఈ విధంగా ఎంతో హృద్యమైన ఆ ఉద్యానవనం పుణ్యానికి ఆస్థానమై, ధర్మానికి సంస్థానమై, సుకృతాలకు మూలస్థానమై వెలుగొందుతూ ఉంటుంది.

3-508-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రివిముఖాత్ము లన్యవిషయాదృత చిత్తులుఁ బాపకర్ములున్
నియనిపాత హేతువును నింద్యచరిత్రము నైన దుష్కథా
నితిఁ జరించువారలును నేరరు పొందఁగ నిందిరామనో
చరణారవింద భజనాత్మకు లుండెడు గొంది నారయన్.

టీకా:

హరి = విష్ణుని; విముఖ = వ్యతిరేక; ఆత్ములు = భావములు కలవారు; అన్య = ఇతరములైన; విషయ = ఇంద్రియార్థ విషయములందు; ఆదృత = లగ్నమైన; చిత్తులు = మనసు కలవారు; పాప = పాపపు; కర్ములు = పనులుచేయువారు; నిరయ = నరకమున; నిపాత = పడిపోవుటకు; హేతువునున్ = కారణములును; నింద్య = నిందింప తగు; చరిత్రమున్ = వర్తనలు కలదియును; ఐన = అయినట్టి; దుః = చెడ్డ; కథా = కథల యందు; నిరతిన్ = లాలసతో; చరించు = తిరుగుతున్న; వారలునున్ = వారును; నేరరు = శక్యము కాదు; పొందగన్ = పొందుటకు; ఇందిరామనోహర = విష్ణుని {ఇందిరా మనోహరుడు - ఇందిర (లక్ష్మీదేవి) మనోహరుడు (భర్త), విష్ణువు}; చరణా = పాదములు అనెడి; అరవింద = పద్మములను; భజన = సేవించు; ఆత్మకులు = స్వభావము కలవారు; ఉండెడు = ఉండునట్టి; గొందిన్ = వీథిని {గొంది - (పాపులు చొరబడుటకు వీలుకాని) సందు, వీథి}; అరయన్ = తరచిచూసిన.

భావము:

విష్ణువునకు విముఖులైనవాళ్ళూ, ఇతర లౌకిక సుఖాలతో సతమతమయ్యే మనస్సు కలవాళ్ళూ, పాపపు నడవడి కలవాళ్ళూ, నరకానికి కారణాలై దూషింపదగిన చెడ్డ కథలందు ఆసక్తి కలిగి మెలిగేవాళ్ళూ భగవంతుని పాదపద్మాలను సేవించే భక్తులుండే ఆ పవిత్ర ప్రదేశాన్ని చేరుకోలేరు.

3-509-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియు.

టీకా:

వెండియున్ = మఱియును.

భావము:

ఇంకా...

3-510-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిఁ బరమేశుఁ గేశవు ననంతు భజింపఁగ ధర్మతత్త్వధీ
రిణతసాధనం బగు స్వభావముఁ దాల్చిన యట్టి మర్త్యులా
సిజనేత్రు మాయను భృశంబుగ మోహితు లై తదంఘ్రిపం
రుహములర్థిమైఁ గొలువఁ గానమిఁ బొందరు తత్పదంబునన్.

టీకా:

హరిన్ = విష్ణుమూర్తిని {హరి - సంగములను హరింపజేయువాడు, భగవంతుడు}; పరమేశున్ = విష్ణుమూర్తిని {పరమేశుడు - పరమమైన ఈశుడు, భగవంతుడు}; కేశవున్ = విష్ణుమూర్తిని {కేశవుడు - కేవలము శుభము యైనవాడు, భగవంతుడు}; అనంతున్ = విష్ణుమూర్తిని {అనంతుడు - అంతములేనివాడు, విష్ణువు}; భజింపగన్ = పూజించుటకు; ధర్మ = ధర్మముయొక్క; తత్వ = లక్షణముల యందు; ధీ = బుద్ధి శక్తి; పరిణత = పరిపక్వత పొందుటకు; సాధనంబు = ఉపయోగపడునది; అగు = అయినట్టి; స్వభావమున్ = స్వభావమును; తాల్చిన = ధరించిన; అట్టి = అటువంటి; మర్త్యులు = మానవులు; ఆ = ఆ; సరసిజనేత్రు = విష్ణుని {సరసిజ నేత్రుడు - సరసిజముల (పద్మము) వంటి నేత్రములు కలవాడు, విష్ణువు}; మాయను = మాయవలన; భృశంబుగన్ = మిక్కిలి; మోహితులు = మోహములో పడినవారు; ఐ = అయ్యి; తత్ = అతని; అంఘ్రి = పాదములు అనెడి; పంకరుహముల్ = పద్మములు; అర్థిమై = కోరువారై; కొలువగన్ = సేవించుట; కానమిన్ = లేకపోవుటచే, తెలియకపోవుటచే; పొందరున్ = పొందరు; తత్ = ఆ; పదంబునన్ = స్థానమును, లోకమును.

భావము:

పాపాలను హరించేవాడూ, పరాత్పరుడూ, కేశవుడూ, అనంతుడూ అయిన విష్ణువును సేవించడానికి ప్రధానసాధనం భక్తి మాత్రమే. కేవలం ధర్మశాస్త్ర పరామర్శతో పండిన బుద్ధికౌశలం కలిగిన మానవులు ఆ నారాయణుని మాయచేత మరింత మోహితులై అతని పాదపద్మాలను సేవించే పద్ధతిని తెలుసుకోలేరు. అందుచేత వారు ఆ వైకుంఠ స్థానాన్ని అందుకోలేకపోతున్నారు.

3-511-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱియు సరోరుహోదరుని మంగళదివ్యకథానులాప ని
ర్భ పరితోష బాష్ప కణ బంధుర చారు కపోల గద్గద
స్వ పులకీకృతాంగు లగువారలు నిస్పృహచిత్తు లత్యహం
ణవిదూరు లుందురు సుర్ముల యుండెడి పుణ్యభూములన్.

టీకా:

మఱియున్ = ఇంకనూ; సరోరుహోదరుని = విష్ణుని {సరోరు హోదరుడు - సరోరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; మంగళ = శుభకరమైన; దివ్య = దివ్యమైన; కథా = కథలను; అనులాప = ధ్యానించుట చే; నిర్భర = పట్టరాని; పరితోష = సంతోషపూర్వక; బాష్ప = కన్నీటి; కణ = బొట్లుతో; బంధుర = నిండిన; చారు = అందమైన; కపోల = చెక్కిళ్ళు; గద్గద = బొంగురుపోయిన; స్వర = గొంతు; పులకీకృత = పులకరములు పొందిన; అంగులు = దేహములు; అగువారలు = కలవారు; నిస్పృహ = కోరికలు లేని; చిత్తులు = మనసులు కలవారు; అతి = మిక్కిలి; అహంకరణ = అహంకారమునకు; విదూరులు = మిక్కిలి దూరముగ ఉండువారు; ఉందురు = ఉండెదరు; సుకర్ములు = పుణ్యాత్ములు {సుకర్ములు - మంచి పనులు చేయువారు, పుణ్యాత్ములు}; ఉండెడి = ఉండునట్టి; పుణ్య = పవిత్రమైన; భూములన్ = ప్రదేశములందు.

భావము:

పద్మనాభుడైన విష్ణువు యొక్క దివ్యమంగళ కథలను ఆలపించడం వల్ల పెల్లుబికిన ఆనందబాష్ప ధారలతో చెమ్మగిలుటవలన అందగించిన చెక్కిళ్ళూ గద్గదమైన కంఠమూ పులకరించిన మేనులూ కలవాళ్ళూ, వైరాగ్యభావం కల మనస్సు కలవాళ్ళూ, అహంకారాన్ని పూర్తిగా విడిచినవాళ్ళూ; సజ్జనులుండే ఆ వైకుంఠ పుణ్యప్రదేశంలో ఉంటారు.

3-512-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అందు.

టీకా:

అందున్ = వానిలో.

భావము:

అక్కడ ఆ వైకుంఠంలో...

3-513-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వైకుంఠము సారసాకరము దివ్యస్వర్ణశాలాంక గో
పు హర్మ్యావృతమైన తద్భవన మంభోజంబు తన్మందిరాం
విభ్రాజిత భోగి గర్ణిక తదుద్యద్భోగ పర్యంకమం
దివొందన్ వసియించు మాధవుఁడు దా నేపారు భృంగాకృతిన్

టీకా:

వర = శ్రేష్ఠమైన; వైకుంఠ = వైకుంఠము అను; పురము = నగరము; సారసాకరము = సరస్సు {సారసాకరము - సారస (నీటికి) ఆకరము (నెలవైనది), చెరువు}; దివ్య = మహిమాన్వితమైన; స్వర్ణ = బంగారపు; శాలన్ = శాలల; అంక = గోడలు; గోపుర = గోపురములు; హర్మ్య = మేడలు; ఆవృతము = ఆవరింపబడినది; ఐన = అయినట్టి; తత్ = ఆ; భవనము = మందిరము; అంభోజంబున్ = పద్మము; తత్ = ఆ; మందిర = మందిరము యొక్క; అంతర = లోపల; విభ్రాజిత = విలసిల్లుతున్న; భోగి = ఆదిశేషుడు {భోగి - సర్పము హరి నివాసమున శయ్యగా ఉండునది, ఆదిశేషుడు}; కర్ణిక = పద్మము యొక్క బొడ్డు; తత్ = ఆ; ఉద్యత్ = ఎత్తిన; భోగ = పడగలు కల; పర్యంకము = శయన తల్పము; అందున్ = దానిపై; ఇరవొందన్ = నెలకొని; వసియించు = ఉండు; మాధవుడు = విష్ణుమూర్తి; తాన్ = అతను; ఏపారున్ = అతిశయించును; భృంగ = తుమ్మెద; ఆకృతిన్ = వలె.

భావము:

శ్రేష్ఠమైన వైకుంఠమే ఒక సరోవరం. దివ్యమైన బంగారు మంటపాలతో, గోపురాలతో, మేడలతో కూడిన ఆ మహామందిరమే పద్మం. ఆ మందిరం మధ్యభాగాన ప్రకాశించే ఆదిశేషుడే తామరదుద్దు. శేషతల్పంపై శయనించే మాధవుడే తుమ్మెద.
మిక్కిలి ప్రసిద్ధమైన ఆణిముత్యం ఈ పద్యం. వరవైకుంఠపురము అనగానే ఈ పద్యాన్ని గుర్తుచేసుకోలేని తెలుగువాళ్ళలో పండితులు కాని పామరులు కాని ఎవరు ఉండేవారు కాదు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురు చతుర్ముఖుని పుత్రులు. వారు పరమ బ్రహ్మవేత్తలు, ఆది ఋషులు, దేవర్షులు. వారు ఒకసారి నారాయణుని దర్శించుకోడానికి వెళ్ళారు. ఆ సందర్భంలోని వైకుంఠపుర వర్ణన యిది.

3-514-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత.

టీకా:

అంతన్ = అంతట.

భావము:

అప్పుడు...

3-515-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిచేఁ బాలితమైన కాంచన విమానారూఢ మైనట్టి స
త్పురుషానీకముచేఁ దనర్చి విభవాపూర్ణప్రభావోన్నతిం
మొప్పారు తదీయ ధామము జగత్కల్యాణమూర్తుల్ మునీ
శ్వరు లర్థిన్ నిజయోగశక్తిఁ బరితుష్టస్వాంతులై చెచ్చెరన్.

టీకా:

హరిన్ = విష్ణుని; చేన్ = చేత; పాలితమున్ = పాలింపబడునది; ఐన = అయినట్టి; కాంచన = బంగారు; విమాన = వాహనములందు; ఆరూఢము = అధిష్టించినవారు; ఐనట్టి = అయినట్టి; సత్ = మంచి; పురుష = పురుషుల; అనీకమున్ = సమూహములు; చేన్ = చేత; తనర్చి = విస్తరిల్లిన; విభవా = వైభవములచే; ఆపూర్ణ = నిండిన; ప్రభావ = ప్రాభవముయొక్క; ఉన్నతిన్ = అతిశయముతో; కరము = మిక్కిలి; ఒప్పారు = చక్కగా ఉన్న; తదీయ = అతని; ధామమున్ = భవనమును; జగత్ = విశ్వమునకు; కల్యాణ = శుభకరమైన; మూర్తుల్ = స్వరూపములు కలవారు; ముని = మునులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; అర్థిన్ = కోరి; నిజ = తమ; యోగశక్తిన్ = యోగశక్తితో; పరితుష్ట = సంతృప్తమైన; స్వాంతులు = హృదయములు కలవారు; ఐ = అయ్యి; చెచ్చరన్ = శీఘ్రముగా {చెచ్చెర - చెర (వేగము) వంతమైన చెరన్ (వేగము), శీఘ్రము}.

భావము:

విష్ణువు పాలించేదీ, బంగారు విమానా లెక్కి విహరించే పుణ్యపురుషులతో నిండినదీ, వైభవంతో కూడిన మహాప్రభావంతో శోభిల్లేదీ అయిన ఆ వైకుంఠధామాన్ని లోకకళ్యాణ స్వరూపులైన సనక సనందనాదులు తృప్తి చెందిన మనస్సులతో తమ యోగశక్తితో వడివడిగా సమీపించారు.

3-516-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డాయంజని.

టీకా:

డాయంజని = చేరవచ్చి.

భావము:

అలా సనకాదులు వైకుంఠపురము సమీపించి...