పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితిగర్భప్రకారంబుజెప్పుట

  •  
  •  
  •  

3-500-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీవు చరాచరప్రచయనేతవు, ధాతవు, సర్వలోకపా
లాళిమౌళిభూషణుఁడ, వంచితమూర్తివి, దేవదేవ! వా
ణీర! యీ యజాండమున నీవు నెఱుంగని యర్థ మున్నదే?
భామునం దలంపుము విన్నుల మమ్ము భవత్ప్రపన్నులన్.

టీకా:

నీవు = నీవు; చరాచరప్రచయనేతవు = బ్రహ్మదేవుడవు {చరాచరప్రచయనేత - చరాచర (సమస్తమైన జీవుల) ప్రచయ (సమూహముల)కును నేత, బ్రహ్మదేవుడు}; ధాతవు = బ్రహ్మదేవుడవు {ధాత - ధరించు వాడు, బ్రహ్మదేవుడు}; సర్వలోకపాలావళిమౌళిభూషణుండవు = బ్రహ్మదేవుడవు {సర్వలోకపాలావళిమౌళిభూషణుండు - సమస్తమైన లోకములను పాలించువారి ఆవళి (సమూహము) కిని మౌళి (శిరస్సు)నకు భూషణుండు (భూషణము వంటివాడు), బ్రహ్మదేవుడు}; అంచితమూర్తివి = బ్రహ్మదేవుడవు {అంచితమూర్తి - పూజనీయమైన స్వరూపము కలవాడు, బ్రహ్మదేవుడు}; దేవదేవ = బ్రహ్మదేవా {దేవదేవుడు - దేవతలకే దేవుడు, బ్రహ్మదేవుడు}; వాణీవర = బ్రహ్మదేవా {వాణీవర - వాణి (సరస్వతీదేవి) కి వరుడు (భర్త), బ్రహ్మదేవుడు}; ఈ = ఈ; అజాండమున్ = బ్రహ్మాండమునందు; నీవు = నీవు; ఎఱుంగని = తెలియని; అర్థము = ప్రయోజనము; ఉన్నదే = కలదా ఏమి; భావమునన్ = మనసులో; తలంపుము = యోచింపుము; విపన్నులన్ = ఆపదపొందినవారలము; మమ్మున్ = మమ్ములను; భవత్ = నీ యొక్క; ప్రపన్నులన్ = శరణుజొచ్చిన వారిని.

భావము:

నీవు చరాచరప్రపంచానికి అధినేతవు. సర్వమూ ధరించేవాడవు. లోకపాలకు లందరిలో అగ్రగణ్యుడవు. పూజనీయమైన స్వరూపం కలవాడవు. సరస్వతికి భర్తవైన ఓ దేవదేవా! ఈ బ్రహ్మాండంలో నీకు తెలియనిది ఏదైనా ఉన్నదా? ఆపదల పాలై నిన్ను శరణు చొచ్చిన మమ్మల్ని గురించి మనస్సులో ఆలోచించు.