పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితిగర్భప్రకారంబుజెప్పుట

  •  
  •  
  •  

3-498-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దితిగర్భ మందు రుచిరాకృతితో నొక తేజ మన్యతే
జోమ లీల వెల్వడి వసుంధరయున్ గగనంబు నిండి సం
ఛాదిత పద్మబాంధవ నిశాకర దీప్తులు గల్గి సూచికా
భే మహోగ్ర సంతమసభీషణ మైన భయాకులాత్ము లై.

టీకా:

ఆ = ఆ; దితి = దితి; గర్భంబున్ = గర్భము; అందున్ = లో; రుచిర = ప్రకాశించుచున్న; ఆకృతిన్ = ఆకారముతో; ఒక = ఒక; తేజమున్ = తేజము; అన్య = ఇతర; తేజస్ = తేజములను; దమ = సంహరించు; లీలన్ = విధముగా; వెల్వడి = ఉద్భవించి; వసుంధరయున్ = భూమియున్; గగనంబున్ = ఆకాశమును; నిండి = నిండి; సంఛాదిత = కప్పబడిన; పద్మబాంధవ = సూర్యుని {పద్మబాంధవుడు - పద్మమములకు ఇష్టమైనవాడు, సూర్యుడు}; నిశాకర = చంద్రుని {నిశాకరుడు - రాత్రి ప్రకాశించువాడు, చంద్రుడు}; దీప్తులు = కాంతులు; కల్గి = కలిగి; సూచికా = సూది; అభేద = కూడా దూరని; మహా = గొప్ప; ఉగ్ర = తీవ్రమైన; సంతమస = కమ్ముకొన్న చీకటితో; భీషణము = భయంకరము; ఐన = అయిన; భయ = భయమును; ఆకుల = చీకాకుపడిన; ఆత్ములు = మనసు కలవారు; ఐ = అయి.

భావము:

ఆ దితి గర్భంలోనుంచి అతిరమణీయమైన ఆకారంతో ఒక తేజస్సు ఇతర తేజస్సు లన్నింటినీ అణచివేస్తూ వెలువడి, నింగీ నేలా నిండుకొని, సూర్యచంద్రుల కాంతులను కప్పివేసింది. సూదికూడా దూరనంతగా మిక్కిలి చిక్కనైన చీకటి భయంకరంగా అంతటా వ్యాపించింది. అందరూ భయంతో వణికిపోయారు.