పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-496-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని తన తనయులు మధుసూ
నుచే హతు లగుదు రనుచుఁ న మనుమఁడు స
జ్జనుత భాగవతుం డగు
నుచు మదిం జాల దుఃఖ ర్షము లొదవన్.

టీకా:

విని = విని; తన = తన; తనయులు = పుత్రులు; మధుసూదనున్ = విష్ణుని {మధుసూదనుడు - మధు అను రాక్షసుని సంహరించిన వాడు, విష్ణువు, విష్ణుసహస్రనామములలో 73వ నామం}; చేన్ = చేత; హతులు = మరణించినవారు; అగుదురు = అవుతారు; అనుచున్ = అని; తన = తన; మనుమడు = మనవడు; సత్ = మంచి; జన = వారిచే; నుత = కీర్తింపబడు; భాగవతుండు = భాగవతుడు {భాగవతుడు - భాగవత సంప్రదాయానుసారము వర్తించు వాడు}; అగున్ = అగును; అనుచున్ = అని; మదిన్ = మనసులో; చాలన్ = మిక్కిలి; దుఃఖ = దుఃఖము; హర్షములున్ = సంతోషములు; ఒదవన్ = కలుగగా.

భావము:

కశ్యపప్రజాపతి పలుకులు విన్న దితి తన కొడుకులు విష్ణువు చేతిలో మరణిస్తారన్న మాటకు విచారించింది. తన మనుమడు పరమ భాగవతుడై సజ్జనులచే గౌరవించబడువాడు అవుతాడన్న మాటకు ఎంతో సంతోషించింది.