పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-494-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలాంతరంగ బహిరం
ములను స్వేచ్ఛానురూపలితుం డగు నా
లాధీశ్వరు కుండల
ణీయ ముఖంబుఁ జూచుఁ బ్రమదం బెసఁగన్.

టీకా:

విమల = నిర్మల; అంతరంగ = మనసు నందును; బహిరంగములను = బాహ్య ప్రపంచములోను; స్వేచ్ఛా = స్వతంత్రతను; అనురూప = అనుగుణమును; కలితుండు = కలిగినవాడు; అగును = అగును; ఆ = ఆ; కమలాధీశ్వరు = విష్ణుని {కమలాధీశ్వరుడు - కమల (లక్ష్మీదేవి) అధీశ్వరుడు (భర్త), విష్ణువు}; కుండల = కుండలములతో; రమణీయ = సుందరమైన; ముఖంబున్ = ముఖమును; చూచున్ = చూచును; ప్రమదంబున్ = ప్రమోదము; ఎసగన్ = అతిశయించగా.

భావము:

నిర్మలమైన తన లోపలా వెలుపలా, సృష్టి అంతటా సర్వ రూపాలు తనవే అయిన, రమావల్లభుడూ అయిన విష్ణువు యొక్క మకరకుండలాలతో మనోహరమైన ముఖాన్ని సంతోషంగా సందర్శిస్తాడు.