పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-492.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తి నిదాఘోగ్ర సమయంబు నందు నిఖిల
జంతు సంతాప మడఁగించు చంద్రుమాడ్కి
ఖిల జగముల దుఃఖంబు పనయించు
రూఢి నాతఁ డజాతవిరోధి యగుచు.

టీకా:

మహిత = గొప్పదైన; దేహ = దేహము; ఆది = మొదలగు వాని ఎడల; అభిమానంబున్ = ఆసక్తిని; దిగనాడి = వదిలివేసి; చిరతర = ఎల్లప్పుడును; అలంపట = తగులుకొనని; శీలుండు = ప్రవర్తన కలవాడు; అగుచున్ = అవుతూ; పర = ఇతరుల; సమృద్ధి = అబివృద్ధి; కిన్ = కి; ఆత్మన్ = మనసులో; పరితోషమున్ = సంతోషమును; అందుచున్ = పొందుచూ; పర = ఇతరుల; దుఃఖమునన్ = దుఃఖమున; కున్ = కు; తాపమున్ = బాధను; పొందున్ = పొందును; ఈ = ఈ; విశ్వము = భువనము; అంతయున్ = అంతా; ఏ = ఏ; విభుని = ప్రభువు; మయము = తోనిండియున్నది; అని = అని; ఎవ్వని = ఎవని; కరుణన్ = కరుణ; చేన్ = చేత; ఎఱుగన్ = తెలియుట; అయ్యెన్ = జరిగెను; అట్టి = అటువంటి; ఈశ్వరునిన్ = భగవంతుని; తాన్ = తాను; ఆత్మసాక్షిగన్ = ఆత్మసాక్షిగా; మోదము = సంతోషము; అడరంగ = అతిశయించగా; చూచుచు = చూస్తూ; అనన్య = అన్యము అన్నది లేని; దృష్టిన్ = దృష్టితో; అతి = మిక్కిలి; నిదాఘ = భయంకరమైన; ఉగ్ర = వేసవికాలపు; సమయంబు = సమయము; అందున్ = లో;
నిఖిల = సమస్తమైన; జంతు = జంతువుల; సంతాపము = బాధ; అడగించు = అణగించు; చంద్రున్ = చంద్రుని; మాడ్కిన్ = వలె; అఖిల = సమస్తమైన; జగముల = లోకముల; దుఃఖంబులన్ = దుఃఖములను; అపనియించున్ = పొగొట్టును; రూఢిన్ = తప్పక; అతడు = అతడు; అజాత = పుట్టని; విరోధి = శత్రువుకలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

నీ మనుమడు శరీరాదులపై అభిమానం లేనివాడై వైరాగ్యంతో కూడిన స్వభావం కలవాడై ఇతరుల అభివృద్ధికి సంతోషిస్తూ, అలాగే ఇతరుల దుఃఖానికి, సంతాపం చెందుతూ ఉంటాడు. ఈ విశ్వం సమస్తమూ, భగవన్మయమని భావిస్తాడు. అటువంటి భావన భగవంతుని దయ వల్లనే కలిగిందని విశ్వసిస్తాడు. అటువంటి భగవంతుణ్ణి సంతోషంతో ఏకాగ్ర దృష్టితో, ఆత్మసాక్షిగా దర్శిస్తాడు. భయంకరమైన ఎండాకాలంలో సర్వజీవులకు తాపాన్ని పోగొట్టే చంద్రునిలా, సమస్త జీవుల సంతాపాన్ని పోగొడతాడు. ఆయనకు శత్రువు అనే వాడు ఉండనే ఉండడు.