పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-490-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హితాత్మకుండు సుగుణాంబుధి భాగవతోత్తముండు ల
క్ష్మీహిళాధినాథుఁ దులసీదళదాముఁ బరేశు నాత్మహృ
త్తారసంబు నందుఁ బ్రమదంబున నిల్పి తదన్యవస్తువుం
దా దిలో హసించు హరిదాస్యవిహారవినిశ్చితాత్ముఁడై.

టీకా:

ఆ = ఆ; మహిత = గొప్ప; ఆత్మకుండు = ఆత్మ కలవాడు; సుగుణ = సుగుణములకు; అంబుధి = సముద్రము వంటివాడు; భాగవత = భాగవతులలో; ఉత్తముండు = శ్రేష్ఠుడు; లక్ష్మీమహిళాథినాథున్ = భగవంతుని {లక్ష్మీమహిళాథినాథుడు - లక్ష్మీ మహిళ (దేవి) అథినాథుడు (పతి), విష్ణువు}; తులసీదళదామున్ = భగవంతుని {తులసీదళదాముడు - తలసీ దళముల దామము (దండను) ధరించువాడు, విష్ణువు}; పరేశున్ = భగవంతుని {పరేశుడు - పర (పరము) నకు ఈశుడు (అధిపతి), విష్ణువు}; ఆత్మ = తన; హృత్ = హృదయము అను; తామరసంబు = పద్మము; అందున్ = లో; ప్రమదంబునన్ = సంతోషముతో; నిల్పి = స్థిరముగ ఉంచుకొని; తత్ = అతనికి, విష్ణునికి; అన్య = ఇతరమైన; వస్తువున్ = వస్తువులను గురించి చెప్పినను; తాన్ = తన; మది = మనసు; లోన్ = లోపల; హసించున్ = నవ్వుకొనును; హరి = విష్ణుని; దాస్య = సేవించుచు; విహార = తిరుగుట యందు; వినిశ్చిత = గట్టిగా నిర్ణయించుకొన్న; ఆత్ముడు = ఆత్మ కలవాడు; ఐ = అయి.

భావము:

అతను పరమ భగవద్భక్తులలో అగ్రగణ్యుడూ, సద్గుణాలకు సముద్రంవంటి వాడూ, మహితాత్ముడూ. ఆ మహానుభావుడు తన హృదయకమలంలో లక్ష్మిదేవి భర్తా, తులసి మాల ధరించువాడూ, పరాత్పరుడూ అయిన విష్ణువును సంతోషంగా నిరంతరం నిలుపుకొని ఆ హరిసేవా మార్గంలోనే జీవితమంతా నడవాలని నిశ్చయించుకున్నవాడు అయి లౌకికములైన వస్తువులను చులకనగా చూస్తాడు.