పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-489-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంచి తాష్టాంగయోగక్రియాకలాపు
లైన యోగీశ్వరులు నమ్మహానుభావు
తులశీలస్వభావవిజ్ఞానసరణిఁ
దాముఁ జరియింప నాత్మలఁ లతు రెపుడు.

టీకా:

అంచిత = పూజనీయమైన; అష్టాంగయోగ = అష్టాంగయోగమును {అష్టాంగయోగ మార్గములు - 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి అని ఎనిమిది (8)}; క్రియా = ఆచరించుట యందు; కలాపులు = నిమగ్నమైనవారు; ఐన = అయినట్టి; యోగీ = యోగులలో; ఈశ్వరులున్ = శ్రేష్ఠులు; ఆ = ఆ; మహానుభావున్ = గొప్పవానిని; అతుల = సాటిలేని; శీల = శీలము; స్వభావ = స్వభావము; విజ్ఞాన = విజ్ఞానము; సరణిన్ = ఒప్పు విధముగ; తాము = తాము; చరియింపన్ = వర్తించవలెనని; ఆత్మలన్ = మనసులలో; తలతురు = యత్నించెదరు; ఎపుడున్ = ఎల్లప్పుడును;

భావము:

శ్రేష్ఠమైన అష్టాంగ యోగక్రియలలో ఆరితేరిన మహా యోగీశ్వరులు సైతం ఆ మహానుభావుని సత్ప్రవర్తనకూ, సాధు శీలానికి మురిసిపోయి ఆయన అడుగుజాడలలో తాము కూడా నడవాలని తమ మనస్సులలో నిత్యమూ కోరుకుంటారు.