పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-488-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వామలోచన! వినుము, దుర్వర్ణహేమ
గ్నిపుటమునఁ బరిశుద్ధమై వెలుంగు
ట్లు దుష్టాత్మసంభవుఁ య్యు వంశ
పావనుం డగు హరిపాదక్తుఁ డగుట.

టీకా:

వామ = చక్కటి; లోచన = కన్నులు ఉన్నదాన; వినుము = వినుము; దుర్వర్ణ = చెడు వన్నె, రంగు తగ్గిన; హేమము = బంగారము; అగ్నిన్ = నిప్పులలో; పుటమునన్ = పుటము పెట్టుట వలన; పరిశుద్ధము = బాగుగ శుభ్రపడినది; ఐ = అయి; వెలుంగున్ = ప్రకాశించిన; అట్లు = విధముగా; దుష్ట = చెడ్డ వాని; ఆత్మసంభవుడు = సంతానము; అయ్యున్ = అయినప్పటికిని; వంశ = వంశమును; పావనుండు = పవిత్రము చేయువాడు; అగున్ = అగును; హరి = విష్ణుని {హరి - సర్వ రక్షకుడు, విష్ణువు}; పాద = పాదములు అందు; భక్తుడు = భక్తి కలవాడు; అగుటన్ = అగుట వలన.

భావము:

వాలుకన్నులు గల అందగత్తెవి అయిన ఓ దితీ! అతడు దుర్మార్గుడైన హిరణ్యకశిపుని పుత్రుడే అయినప్పటికీ, శ్రీహరి పాద భక్తుడు కావటంవల్ల, మాసి రంగు తగ్గిన బంగారం అగ్నితో పరిశుద్ధమైనట్లు, వంశాని కంతా పరమ పవిత్రు డౌతాడు.