పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-484-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుడుఁ గశ్యపుండు గమలానన కిట్లను "నింతి! నీవు చే
సి విపరీతకర్మమునఁ జేకుఱె నిట్టి యవస్థ దీనికిన్
మునఁ దాప మొందకుము మాధవుపాదసరోజయుగ్మచిం
మునఁ జేసియున్ నను ముదంబునఁ గొల్చుట జేసియుం దగన్.

టీకా:

అనవుడు = అనగా; కశ్యపుండు = కశ్యపుడు; కమలానన = అందగత్తె {కమలానన - పద్మములవంటి అననము (ముఖము) కలామె, స్త్రీ}; కున్ = కి; ఇట్లు = ఈవిధముగా; అను = అనెను; ఇంతి = స్త్రీ; నీవు = నీవు; చేసిన = చేసిన; విపరీత = చేయరాని; కర్మమునన్ = పనివలన; చేకూఱెన్ = సంభవించినది; ఇట్టి = ఇటువంటి; అవస్థ = పరిస్థితి; దీనికిన్ = ఇందుకోసము; మనమునన్ = మనసులో; తాపమున్ = బాధ; ఒందకుము = పొందకుము; మాధవున్ = విష్ణుని {మాధవుడు - మాధవికి ధవుడు (భర్త), విష్ణువు}; పాద = పాదములు అను; సరోజ = పద్మముల; యుగ్మ = జంట యందలి; చింతనమునన్ = ధ్యానమును; చేసియున్ = చేయటం; ననున్ = నన్ను; ముదంబున్ = సంతోషముగా; కొల్చుటన్ = సేవించుట; చేసియున్ = చేయటం; తగన్ = అవశ్యము.

భావము:

ఇలా చెప్పిన దితితో కశ్యపప్రజాపతి ఇలా అన్నాడు “ఓ అందమైన దితీదేవీ! నీవు చేసిన ఈ తప్పు వలన ఇలాంటి పరిస్థితి వచ్చింది. సరేకాని, దీనికి మనసులో బాధపడకు. శ్రీమహావిష్ణువు పాదపద్మాలను ధ్యానించటం, నన్ను సంతోషంగా సేవించటం తప్పక చెయ్యి.