పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-481-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి దుష్కర్ములకును మహాత్ము లలిగి
విశ్వవిదుఁ డైన హరికిని విన్నవింప
తఁడు కోపించి హరి కులిశాయుధమున
గిరుల నఱకినగతి వారిఁ ణి గూల్చు."

టీకా:

అట్టి = అటువంటి; దుష్కర్ముల్ = చెడ్డ పనులు చేయువారి; కునున్ = కిని; మహాత్ములు = గొప్పవారు; అలిగి = కోపించి; విశ్వ = విశ్వమునకు; విదుడు = ఎరిగినవాడు; ఐన = అయిన; హరి = విష్ణుని; కిని = కి; విన్నవింపన్ = చెప్పుకొనగా; అతండు = అతడు; కోపించి = కోపించి; హరి = ఇంద్రుడు; కులిశాయుధమున = వజ్రాయుధముతో; గిరులన్ = కొండలను; నఱకిన = ఛేదించిన; గతిన్ = గతిన్; వారిన్ = వారిని; ధరణిన్ = నేల; కూల్చున్ = కూల్చును.

భావము:

అటువంటి దుష్కర్ముల, దుండగాలకు మహాత్ములు సహించలేకపోతారు. వారు సర్వజ్ఞుడైన విష్ణువుకు వీరి క్రూరకృత్యాలు, విన్నవించుకుంటారు. ఆయన ఆగ్రహించి ఇంద్రుడు వజ్రాయుధంతో కొండలను ఖండించినట్లు ఆ దుర్మార్గులను హతమారుస్తాడు. "