పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-480-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రఁగిన దర్పోద్ధతు లి
ద్దఱు గొడుకులు నీకుఁ బుట్టి రణికి వ్రేఁగై
నితము బుధజనపీడా
రులై వర్తింతు రాత్మ లగర్వమునన్.

టీకా:

పరగినన్ = ప్రసిద్దిచెందిన; దర్ప = గర్వముతో; ఉద్దతులు = మిడిసిపడువారు; ఇద్దఱు = ఇద్దరు (2); కొడుకులున్ = పుత్రులు; నీకున్ = నీకు; పుట్టి = పుట్టి; ధరణి = భూమి; కిన్ = కి; వ్రేగు = భారము; ఐ = అయి; నిరతమున్ = ఎల్లప్పుడును; బుధ = జ్ఞానులగు; జన = జనులను; పీడా = పీడించుట యందు; పరులు = నిమగ్నులు; ఐ = అయి; వర్తింతురు = తిరుగుదురు; ఆత్మ = తమ; బల = బలము యొక్క; గర్వమునన్ = గర్వముతో.

భావము:

ఆ నీ కుమారులు మహా బలవంతులూ, అతి గర్విష్ఠులూ. వారిద్దరూ తమ పరాక్రమాటోపంతో నిరంతరమూ సజ్జనులను బాధిస్తూ భూమికి భారమైన వారు అవుతారు.