పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-476-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెలికి గర్భచిహ్నము
లేచినఁ బరితోషమాత్మ నేపారగ మా
రీచుండు నిజతలోదరిఁ
జూచి యకర్మమున కాత్మ స్రుక్కుచుఁ బలికెన్.

టీకా:

ఆ = ఆ; చెలి = భార్య; కిన్ = కి; గర్భ = గర్భధారణ; చిహ్నములు = గుర్తులు; లేచిన = పొడచూపగా; పరితోషమున్ = సంతోషము; ఆత్మన్ = మనసులో; ఏపారగన్ = అతిశయించగా; మారీచుండు = కశ్యపుడు {మారీచుడు - మరీచి యొక్క కొడుకు, కశ్యపుడు}; నిజ = తన; తలోదరిన్ = భార్యను; చూచి = చూసి; అకర్మమున్ = కానిపని; కున్ = కు; ఆత్మన్ = ఆత్మలో; స్రుక్కుచున్ = బాధపడుతూ; పలికెన్ = పలికెను.

భావము:

తన భార్యకు గర్భం నిలిచినందుకు ఆ మరీచి పుత్రుడైన కశ్యపప్రజాపతి ఆనందం అతిశయించినా, చేయరాని పని చేసినందుకు మనస్సులో బాధపడుతూ, పల్చని ఉదరం గల సుందరి అయిన తన కాంతతో ఇలా అన్నాడు.