పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కశ్యపుని రుద్రస్తోత్రంబు

  •  
  •  
  •  

3-469-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిర్భాగ్యులుగా మదిఁ
ను" మని యీరీతిఁ బ్రియకుఁ శ్యపుఁ డెఱిగిం
చి దితి గ్రమ్మఱఁ బలికెను
సిజసాయకవిభిన్నమానస యగుచున్.

టీకా:

ఘన = మిక్కిలి; నిర్భాగ్యులున్ = దరిద్రులు; కాన్ = అగునని; మదిన్ = మనసులో; కనుము = చూడుము; అని = అని; ఈ = ఈ; రీతిన్ = విధముగ; ప్రియకున్ = ప్రియమైన భార్యకు; కశ్యపుడు = కశ్యపుడు; ఎఱిగించినన్ = తెలుపగా; దితి = దితి; క్రమ్మఱన్ = మరల; పలికెన్ = పలికెను; మనసిజ = మన్మథుని {మనసిజుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; సాయక = బాణములతో {సాయక - సాయపడునవి (మన్మథునికి), బాణములు}; విభిన్న = బాగాకొట్టబడిన; మానస = మనసు కలది; అగుచున్ = అవుతూ.

భావము:

అట్టి శివ వ్యతిరేకులు పరమ దౌర్భాగ్యులని తెలుసుకొ” అని తన ప్రియసతి అయిన దితికి కశ్యపప్రజాపతి తెలిపాడు. కాని ఆమె మన్మథుని బాణాలచే దెబ్బతిన్న మనస్సు కలది అయి, కశ్యపునితో ఇంకా అలా మాట్లాడ సాగింది.