పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కశ్యపుని రుద్రస్తోత్రంబు

  •  
  •  
  •  

3-467-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాల-
రు లాత్మపద వైభములఁ దనరి
రెవ్వని యాజ్ఞ వహించి వర్తించును-
విశ్వనేత్రి యగు నవిద్య యెపుఁడు
నెవ్వని మహిమంబు లిట్టివట్టివి యని-
ర్కింప లేవు వేదంబు లయిన
నెవ్వని సేవింతు రెల్ల వారును సమా-
నాధికరహితుఁ డై లరు నెవ్వఁ

3-467.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి దేవునిఁద్రిపురసంహారకరుని
స్థిమాలాధరుండు బిక్షాశనుండు
భూతిలిప్తాంగుఁ డుగ్రపరేభూమి
వాసుఁ డని హాస్య మొనరించు వారు మఱియు.

టీకా:

ఎవ్వని = ఎవని; కరుణన్ = దయవలన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; దిక్పాల = దిక్పాలకులురైన {అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు - తూర్పు దిక్కునకు 2 అగ్ని - ఆగ్నేయ దిక్కునకు 3 యముడు - దక్షిణ దిక్కునకు 4 నిరృతి - నైఋతి దిక్కునకు 5 వరుణుడు - పడమటి దిక్కునకు 6 వాయువు -వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు - ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు - ఈశాన్య దిక్కునకు పరిపాలకులు}; వరులు = శ్రేష్ఠులు; ఆత్మ = తమ; పద = పదవుల; వైభవములన్ = వైభవములందు; తనరి = అతిశయించి; ఎవ్వని = ఎవని; ఆజ్ఞన్ = ఆజ్ఞని; వహించి = ధరించి; వర్తించును = ప్రవర్తించుదురు; విశ్వ = విశ్వమునకు; నేత్రి = రాణి {నేత (పు) - నేత్రి (స్త్రీ)}; అగు = అయిన; అవిద్య = మాయ, అవిద్య; ఎపుడు = ఎప్పుడును; ఎవ్వని = ఎవరి; మహిమంబుల్ = మహిమలు; ఇట్టివి = ఇటువంటివి; అట్టివి = అటువంటివి; అని = అని; తర్కింపన్ = విచారింప; లేవు = లేవు; వేదంబులున్ = వేదములు; అయినన్ = అయినప్పటికిని; ఎవ్వనిన్ = ఎవరిని; సేవింతురు = సేవిస్తుంటారో; ఎల్లవారును = అందరును; సమాన = సమానులు కాని; అధిక = అధికులు కాని; రహితుండు = లేనివాడు; ఐ = అయ్యి; అలరున్ = విలసిల్లును; ఎవ్వడు = ఎవరు; అట్టి = అటువంటి;
దేవునిన్ = పరమ శివుని {దేవుడు - దివ్యమైనవాడు, శివుడు}; త్రిపురసంహారకునిన్ = పరమ శివుని {త్రిపురసంహారకుడు, త్రిపురాసురుని సంహరించినవాడు, శివుడు}; అస్థిమాలాధరుండు = అస్థిమాలాధరుడు {అస్థిమాలాధరుడు - అస్థి (ఎముకలు) మాలలను ధరించువాడు, శివుడు}; భిక్షాశనుండు = భిక్షాశనుడు {భిక్షాశనుడు - భిక్షమెత్తుకొని ఆశనుడు (తినువాడు), శివుడు}; భూతిలిప్తాంగుడు = భూతిలిప్తాంగుడు {భూతిలిప్తాంగుడు - భూతి (బూడిద, విభూతి)ను లిప్త పూసుకొనిన) అంగుడు (దేహము కలవాడు), శివుడు}; ఉగ్రపరేతభూమివాసుడు = ఉగ్రపరేతభూమివాసుడు {ఉగ్రపరేతభూమివాసుడు - ఉగ్ర (భయంకరమైన) పరేత (శ్మశాన) భూమి యందు వాసుడు (వసించువాడు), శివుడు}; అని = అని; హాస్యమున్ = వేళాకోళము; ఒనరించు = చేయు; వారు = వారు; మఱియున్ = ఇంకనూ.

భావము:

ఎవరి అనుగ్రహంవల్ల బ్రహ్మదేవుడు, ఇంద్రాది దిక్పాలకులు తమతమ పదవులను అధిష్టించి అతి వైభవంగా ఉంటున్నారో, ఎవరి ఆజ్ఞకు లోబడి ఈ సమస్త ప్రపంచానికీ రాణి అనదగిన మాయ ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటుందో, ఎవరి గొప్పదనం ఎంతటిదో వేదాలు కూడా నిరూపించలేవో, ఎవరిని అందరూ సేవిస్తారో, ఎవరు తనతో సాటివారూ, తనకంటే మేటివారూ లేనివారో అటువంటి దేవదేవుని, త్రిపురాసుర సంహారుని, హరుని, అస్ధిమాలాధరునీ, ఆది భిక్షువుని, బూడిద పూసుకునేవాడనీ, శ్మశానవాసి అనీ, అపహాస్యం చేసేవారు పరమ నిర్భాగ్యులు.